నయనతో శింబు లవ్ డ్యూయెట్లు

20 Nov, 2013 04:39 IST|Sakshi
నయనతో శింబు లవ్ డ్యూయెట్లు

 అప్పట్లో శింబు, నయనతార ఎంత ఘాటు ప్రేమయో అంటూ లవ్వాటాడుకున్నారు. తర్వాత వారి మధ్య ప్రేమ మాయమైంది. ఇటీవల శింబు, హన్సిక ఔను మేము ప్రేమించుకుంటున్నాం. పెళ్లి కూడా చేసుకుంటాం అన్నారు. ఇప్పుడు వీరి ప్రేమ కథ కంచికి చేరిందంటున్నారు. అంతేకాదు మాజీ ప్రేయసి నయనతారతో శింబు మళ్లీ డ్యూయెట్లు పాడడానికి సిద్ధం అవుతున్నారన్నది తాజా సమాచారం. శింబు, నయనతార ఇంతకుముందు వల్లవన్ చిత్రంలో జతకట్టారు.
 
 ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ పుట్టింది. చాలా సన్నిహితంగా మెలిగారు. ఆ ఫొటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేయడంతో వీరి ప్రేమకు ముసలం పుట్టింది. శింబునే వాటిని నెట్‌లో ప్రచారం చేశారన్న విషయం తెలిసి నయనతార మనసు విరిగిపోయింది. ఇటీవల శింబు లవ్‌లో పడ్డ హన్సికను పలువురు ఆక్షేపించారు. దీంతో పునరాలోచనలో పడ్డ హన్సిక శింబుకు దూరం అవుతూ వచ్చింది.
 
 ఇప్పుడు వీరి మధ్య పెద్ద అగాథం ఏర్పడినట్లు సమాచారం. శింబు తాజాగా నటిస్తున్న చిత్రంలో మాజీ ప్రియురాలు నయనతార హీరోయిన్‌గా నటించనున్నారట. ఈ విషయాన్ని స్వయానా ఆ చిత్ర దర్శకుడు పాండిరాజ్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దీంతో హన్సిక పోయే, శింబు నయన్‌తో మళ్లీ జోడి చేరే అంటున్నారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి