విలన్గా స్టార్ హీరోయిన్..!

21 Jun, 2017 15:47 IST|Sakshi
విలన్గా స్టార్ హీరోయిన్..!

90లలో వెండితెరను ఏలిన ఓ అందాల భామ, రీ ఎంట్రీ విలక్షణ పాత్రలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. గ్లామర్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన టాప్ స్టార్ సిమ్రన్ త్వరలో తమిళ సినిమాతో విలన్ గా మారుతోంది.  కోలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో శివకార్తీకేయన్ సినిమాలో సీనియర్ హీరోయిన్ సిమ్రన్ కీలక పాత్రలో నటించనుంది.

సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సిమ్రన్ చేయబోయేది నెగెటివ్ రోల్ అని తెలుస్తోంది. పొన్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను 24 ఎం ఎం బ్యానర్ పై నిర్మిస్తున్నారు. పెళ్లి వార్తల తరువాత సమంత ఓ మీడియం రేంజ్ సినిమాకు ఓకె చెప్పటం ఒక విశేషం కాగా.. సిమ్రన్ లాంటి టాప్ హీరోయిన్ నెగెటివ్ రోల్లో కనిపిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.