నా ఫొటోలు దుర్వినియోగం చేస్తున్నారు! | Sakshi
Sakshi News home page

నా ఫొటోలు దుర్వినియోగం చేస్తున్నారు!

Published Wed, Sep 23 2015 11:03 AM

నా ఫొటోలు దుర్వినియోగం చేస్తున్నారు! - Sakshi

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల పేరుతో నకిలీ ఫేస్బుక్ పేజీలు పెట్టడం, వాళ్లతో దిగిన ఫొటోలను ఇష్టం వచ్చినట్లు వాడుకోవడం బాగా ఎక్కువైంది. దాని బాధితుల్లో తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ చేరాడు. తాను ఓ సినిమాలో నటిస్తున్నట్లుగా ఓ నకిలీ ఫేస్బుక్ పేజీలో రాశారంటూ బుధవారం పొద్దున్నే సల్లూభాయ్ ట్వీట్ చేశాడు.

ఇలాంటి నకిలీ పేజీలు, వదంతుల పట్ల జాగ్రత్తగా ఉండాలని అభిమానులకు తెలిపాడు. తాను గానీ, తన మేనేజర్లు గానీ ఎలాంటి కొత్త ప్రాజెక్టుకు ఆమోదం తెలపలేదని స్పష్టం చేశాడు. ఇక కొంతమంది తనతో కలిసి ఫొటోలు దిగుతున్నారని, తర్వాత మాత్రం వాటిని దుర్వినియోగం చేస్తున్నారని కూడా ఒకింత ఆగ్రహంగా స్పందించాడు. ఇది ఏమాత్రం సరికాదని, తనకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశాడు.

 

Advertisement
Advertisement