అంగరంగ వైభవంగా సోనమ్‌- ఆనంద్‌ల వివాహం

8 May, 2018 17:31 IST|Sakshi
వివాహానంతరం నవ్వులు చిందిస్తున్న ఆనంద్‌- సోనమ్‌ దంపతులు

అనిల్‌ కపూర్‌ గారాల పట్టి, బాలీవుడ్‌ ఫ్యాషన్‌ ఐకాన్‌  సోనమ్‌ కపూర్‌, వ్యాపారవేత్త ఆనంద్‌ అహుజాల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. సోనమ్‌ ఆంటీ కవితా సింగ్‌కు చెందిన వారసత్వ బంగ్లాలో వీరి పెళ్లి వేడుకను నిర్వహించారు. సిక్కు సంప్రదాయం ప్రకారం మంగళవారం ఉదయం 11- 12.30 గంటల ప్రాంతంలో సోనమ్‌- ఆనంద్‌లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఫ్యాషన్‌ ఐకాన్‌గా పేరొందిన సోనమ్‌.. వివాహ వేడుకలో అనురాధా వాకిల్‌ రూపొందించిన లెహంగా ధరించారు. ఎరుపు రంగు లెహంగాపై బంగారు వర్ణం తామరపువ్వులతో కూడిన డిజైన్‌తో సంప్రదాయ దుస్తుల్లో అచ్చం రాజకుమారిలా కనిపించారు సోనమ్‌. బంగారు వర్ణం షేర్వాణీ ధరించిన ఆనంద్‌ మెడలో రూబీ మాలతో సింప్లీ సూపర్బ్‌ అనిపించారు.

ముంబైలోని బాంద్రాలో అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన సోనమ్‌- ఆనంద్‌ల పెళ్లి వేడుకకు బంధువులతో పాటు, బాలీవుడ్‌ తారాలోకం కూడా కదిలి వచ్చింది. సోనమ్‌ కజిన్స్‌ అర్జున్‌ కపూర్‌, అన్షులా, జాహ్నవీ కపూర్‌, ఖుషీ కపూర్‌లు పెళ్లిలో సందడి చేయగా.. బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌, రణ్‌వీర్‌ సింగ్‌, రాణీ ముఖర్జీ, కరీనా- సైఫ్‌ అలీఖాన్‌ దంపతులు, కరీష్మా కపూర్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, స్వరా భాస్కర్‌ తదితరులు హాజరై సందడి చేశారు.

ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వార్తలు