హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌ 

27 Jun, 2018 00:04 IST|Sakshi

‘నా పేరు నరసింహ.. ఇంటి పేరు నరసింహ...’,  ‘నేనాటో వాణ్ని ఆటోవాణ్ని..’, ‘దేవుడ దేవుడ తిరుమల దేవుడా..’... ఇవి రజనీకాంత్‌ సినిమాల్లో ఇంట్రడక్షన్‌ సాంగ్స్‌ అని మనందరికీ తెలుసు. ఈ పాటలన్నీ పాడింది ప్రముఖ గాయకుడు ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం. రజనీ–బాలు కాంబినేషన్‌ సూపర్‌ హిట్‌. అయితే ఇటీవల రిలీజ్‌ అయిన రజనీకాంత్‌ సినిమాల్లో ఎస్పీబీ టైటిల్‌ ట్రాక్‌ ఏదీ పాడలేదు. రజనీ సినిమాలు కూడా ఇదివరకటి స్థాయిలో ఆడలేదు.

ఆ సంగతలా ఉంచితే రజనీ–బాలుల హిట్‌ కాంబినేషన్‌ని రిపీట్‌ చేయనున్నారట దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌. రజనీకాంత్‌ హీరోగా కార్తీక్‌ సుబ్బరాజ్‌ ఓ మూవీ డైరెక్ట్‌ చేస్తున్నారు. అందులోని టైటిల్‌ సాంగ్‌ను ఎస్పీబీతో పాడించారట చిత్రసంగీత దర్శకుడు అనిరు«ద్‌. సూపర్‌ హిట్‌ సెంటిమెంట్‌ రిపీట్‌ చేశారు. సినిమా కూడా సూపర్‌ సక్సెస్‌ అవుతుందని రజనీ ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు. సన్‌ నెట్‌వర్క్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్‌ కానుంది. 

మరిన్ని వార్తలు