ఆయనలా వంద మందిని కొట్టాలనుకునేవాణ్ణి! | Sakshi
Sakshi News home page

ఆయనలా వంద మందిని కొట్టాలనుకునేవాణ్ణి!

Published Mon, Dec 14 2015 1:29 AM

ఆయనలా వంద మందిని కొట్టాలనుకునేవాణ్ణి!

బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవడంలేదు
 
ఈసారి పుట్టినరోజు జరుపుకోవడంలేదు. ఆ డబ్బును చెన్నై వరద బాధితుల సహాయార్థం ఖర్చు చేస్తాను.  చెన్నైలో  విష్ణు, విశాల్, లక్ష్మీరాయ్, వెంకట్ ప్రభు, సూరీ.. మేమంతా ఒక గ్యాంగ్. గతంలో నేపాల్‌లో ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు సహాయం చేశాం. ఇప్పుడు చెన్నైకి మా వంతు సహాయం చేస్తున్నాం.
 
 ‘‘నేను పుట్టింది గుంటూరులో అయినా పెరిగింది చెన్నైలోనే. అక్కడ  ఉన్నందువల్ల తమిళ సినిమాలు ఎక్కువగా చేస్తున్నా. ఇకనుంచీ తెలుగు చిత్రాలపై దృష్టి పెడతా’’ అని ఆది పినిశెట్టి అన్నారు. దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడు అనే ముద్ర నుంచి బయట పడి తమిళంలో హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆది. ‘గుండెల్లో గోదారి’ తర్వాత ఆయన హీరోగా నటించిన ‘మలుపు’ విడుదలకు సిద్ధంగా ఉంది. నేడు ఆది పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన మనోభావాలు ఈ విధంగా... ‘మలుపు’ని తెలుగు, తమిళ భాషల్లో మా అన్నయ్య సత్యప్రభాస్ దర్శకత్వంలో మా నాన్నగారు నిర్మించారు. తమిళంలో ప్రేక్షకాదరణ పొందింది. మంచి సినిమా కిల్ కాకూడదని తెలుగు రిలీజ్ కోసం మంచి తేదీ చూస్తున్నాం. జనవరిలో దొరికింది. ఈ చిత్రం తెలుగులో నాకు మంచి మలుపు అవుతుందనే నమ్మకం ఉంది. కాలేజీ ఫోర్త్ ఇయర్ ఎండింగ్‌లో ఈ కథ స్టార్ట్ అవుతుంది. స్టయిలిష్‌గా కనిపించడం కోసం బరువు తగ్గాను. నార్మల్‌గా వచ్చే సినిమాల కన్నా డిఫరెంట్‌గా ఉంటుంది.

అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీనుగారు దర్శకత్వం వహిస్తున్న ‘సరైనోడు’లో విలన్‌గా చేస్తున్నాను. మామూలుగా విలన్ అంటే అరవడం, పొడవడం అలా ఉంటుంది. కానీ, ఈ చిత్రంలో విలన్ చాలా డిఫరెంట్‌గా ఉంటాడు. అందుకే అంగీకరించాను. చిన్నప్పుడు చిరంజీవి అంకుల్ సినిమాలు చూసి, ఆయనలా మనమూ వందమందిని కొట్టాలి అనుకునేవాణ్ణి. కానీ, యాక్టింగ్‌ని సీరియస్‌గా తీసుకోలేదు. ఒక్కో ఆర్టిస్ట్‌కీ ఒక్కో శైలి ఉంటుంది. అమితాబ్‌బచ్చన్‌గారిదో స్టైల్. షారుక్‌ఖాన్, అక్షయ్ కుమార్‌లది మరో స్టైల్. తెలుగులో పవన్ కళ్యాణ్‌కీ ఓ స్టైల్ ఉంది.
 

Advertisement
Advertisement