శ్రీకృష్ణ వొట్టూరు సమర్పణలో ఓమా ప్రొడక్షన్స్ పతాకంపై నవీన్ మన్నేల స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న చిత్రం ‘ఇట్లు అంజలి’. ఈ సినిమాలో శ్రీ కార్తికేయ, హిమాన్సీ, శుభాంగి పంత్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ హీరో శ్రీకాంత్, దర్శకుడు మారుతి చేతుల మీదుగా సోమవారం హైదరాబాద్ లో జరిగింది.
ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ...‘ ట్రైలర్ , పాటలు చాలా బావున్నాయి. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసి మెప్పించిన శ్రీ కార్తికేయ హీరోగా పరిచయమవుతోన్న ఈ సినిమా, తనతో పాటు టీమ్ అందరికీ మంచి పేరు తీసుకురావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా’ అన్నారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ...‘ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన శ్రీ కార్తికేయ ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. ట్రైలర్ లో తన పర్ఫార్మెన్స్ చాలా బావుంది. హీరోగా తనకు ఈ సినిమా మంచి పేరు తీసుకొస్తుందని నమ్ముతున్నా’ అన్నారు.
దర్శక నిర్మాత నవీన్ మన్నేల మాట్లాడుతూ... ‘నాకు ఇష్టమైన హీరో శ్రీకాంత్ గారు, దర్శకుడు మారుతిగారు మా ఫంక్షన్ కు వచ్చి వారి చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇదొక ప్రేమలేఖ ఆధారంగా సాగే డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం. ఇప్పటి వరకు వచ్చిన థ్రిల్లర్స్ కన్నా చాలా విభిన్నంగా ఉంటుంది. టీమ్ అంతా కష్టపడి సినిమా చేసాం. మా కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుందన్న నమ్మకంతో ఉన్నాం. ఇందులో చాలా రిస్కీ షాట్స్ ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది’ అన్నారు.
హీరో శ్రీ కార్తికేయ మాట్లాడుతూ...‘‘ఆ నలుగురు’ సినిమాలో అప్పడాల కుర్రాడిగా నాకు మంచి పేరొచ్చింది. ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేసా. హీరోగా ఇది నా తొలి సినిమా. ప్రొడ్యూసింగ్, డైరక్షన్ రెండూ చాలా టఫ్ జాబ్స్. అయినా మా నవీన్ గారు రెండింటినీ సమర్థవంతంగా నిర్వహించారు. అలాగే కార్తిక్ కొడకండ్ల అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగా కుదిరింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆదరించిన నన్ను హీరోగా కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నా’ అన్నారు.
‘ఇట్లు అంజలి’ ట్రైలర్ లాంచ్
Published Tue, May 7 2019 3:39 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్‌గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్‌పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్‌ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్‌పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్‌కుమార్ ఆగ్రహం
Advertisement