ఆడు మగాడ్రా బుజ్జి | Sakshi
Sakshi News home page

ఆడు మగాడ్రా బుజ్జి

Published Thu, Sep 12 2013 1:16 AM

ఆడు మగాడ్రా బుజ్జి

ఎస్‌ఎమ్‌ఎస్, ప్రేమకథా చిత్రమ్ చిత్రాల విజయంతో మంచి జోష్ మీదున్న సుధీర్‌బాబు ప్రస్తుతం ‘ఆడు మగాడ్రా బుజ్జి’ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. కలర్స్ అండ్ క్లాప్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సుబ్బారెడ్డి, ఎస్.ఎన్. రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కృష్ణారెడ్డి గంగదాసు దర్శకుడు.
 
 ఈ చిత్రం టాకీపార్ట్ పూర్తయ్యింది. ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఈ చిత్రం టైటిల్‌కి మంచి స్పందన లభిస్తోంది. అలాగే ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కి కూడా అనూహ్యమైన స్పందన వచ్చింది. సినిమా కూడా అన్ని వర్గాలవారిని ఆకట్టుకునే విధంగా ఉంటుంది. యాక్టింగ్, డాన్స్, ఫైట్స్‌కి మంచి స్కోప్ ఉన్న పాత్రను సుధీర్‌బాబు చేస్తున్నారు. 
 
 ఆయన కెరీర్‌కి మంచి చిత్రం అవుతుంది’’ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘చిత్రంలో ఉన్న ప్రధాన తారాగణంతో ఈ పాట తీస్తున్నాం. హైదరాబాద్‌లోనే మరో పాటను చిత్రీకరించి, అనంతరం మిగిలిన నాలుగు పాటలను మలేసియాలో తీస్తాం. యూత్‌ని, ఫ్యామిలీస్‌ని ఆకట్టుకునే చిత్రం అవుతుంది. త్వరలోనే పాటలను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీ, కెమెరా: శాంటోనియో ట్రెజియో.

Advertisement

తప్పక చదవండి

Advertisement