దేవీ తెరమీదకు వచ్చేది ఎప్పుడు..? | Sakshi
Sakshi News home page

దేవీ తెరమీదకు వచ్చేది ఎప్పుడు..?

Published Thu, May 26 2016 11:28 AM

దేవీ తెరమీదకు వచ్చేది ఎప్పుడు..?

చాలా రోజులుగా టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ దేవీ శ్రీ ప్రసాద్ హీరోగా ఎంట్రీ ఇవ్వడం కోసం ఎదురుచూస్తున్నాడు. తన సినిమాల ఆడియో ఫంక్షన్లలో హుషారెత్తించే పాటలతో పర్ఫామెన్స్లతో అలరించే దేవీని పూర్తి స్థాయి హీరోగా వెండితెర మీద చూడాలని అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. అందుకే దేవీ కూడా తన సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ త్వరలోనే ఉంటుందంటూ సంకేతాలిచ్చేశాడు.

తన స్నేహితుడు, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో దేవీ శ్రీ ప్రసాద్ హీరోగా సినిమా ఉంటుందని కన్ఫామ్ చేశారు. అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం సంగీత దర్శకుడిగా చేతి నిండా సినిమాలతో దేవీ యమా బిజీగా ఉన్నాడు. సుకుమార్ కూడా రామ్ చరణ్ హీరోగా తెరకెక్కబోయే సినిమా కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు.

అయితే ఈ సినిమా పట్టాలెక్కడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ధృవ సినిమా కోసం రెడీ అవుతున్న చరణ్, ఆ సినిమాతో పాటు చిరు 150 సినిమా కూడా పూర్తయితేగాని మరో సినిమా అంగీకరించే పరిస్థితిలేదు. అంటే దాదాపు మరో ఏడాది పాటు సుకుమార్ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశమే లేదు. ఆ తరువాత చరణ్ సినిమా పూర్తి చేసిగాని దేవీ శ్రీ హీరోగా తెరకెక్కబోయే సినిమాను మొదలు పెట్టాలి. అంటే దేవీని హీరోగా వెండితెర మీద చూడాలంటే అభిమానులు మరో రెండేళ్ల పాటు వెయిట్ చేయాల్సిందే.

Advertisement
Advertisement