ఎవరూ చెడ్డ కాదు

31 May, 2019 03:09 IST|Sakshi

‘ఈ ప్రపంచంలో ఎవరూ చెడ్డ కాదు.. ఎవరూ మంచి కాదు. పరిస్థితుల ప్రభావంతోనే మంచివాళ్లుగా, చెడ్డవాళ్లుగా మారతారు’ అనే సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని సుమంత్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. నితిన్, నాని, నిఖిల్‌ వంటి హీరోలతో పలు హిట్‌ చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత డి.ఎస్‌.రావు తన మిత్రుడు పి.జగన్‌మోహన్‌ రావుతో కలిసి ఈ సినిమా నిర్మించనున్నారు. ఈ చిత్రంతో సంతోష్‌ కుమార్‌ దర్శకుడిగా పరిచయం కానున్నారు.

సంజన ప్రొడక్షన్స్‌– సాయికృష్ణా ప్రొడక్షన్స్‌ పతాకాలపై ఈ సినిమా తెరకెక్కనుంది. ‘‘యాక్షన్‌ డ్రామాగా రూపొందనున్న చిత్రమిది. సుమంత్‌ సరసన సిమ్రత్‌ కథానాయికగా నటించనుంది. సుమంత్‌ను కొత్త కోణంలో, సరికొత్త గెటప్‌లో చూపించే ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళుతుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అని దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: యాజమాన్య, కెమెరా: అష్కర్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు