సరికొత్త సునీల్‌ | Sakshi
Sakshi News home page

సరికొత్త సునీల్‌

Published Sat, Sep 2 2017 12:15 AM

సరికొత్త సునీల్‌

సునీల్‌ హీరోగా మహాలక్ష్మీ ఆర్ట్స్‌ పతాకంపై స్వీయదర్శకత్వంలో ఎన్‌.శంకర్‌రూపొంది స్తోన్న చిత్రం ‘2 కంట్రీస్‌’. మలయాళ హిట్‌ మూవీ ‘2 కంట్రీస్‌’కి ఇది రీమేక్‌. షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న ఈ చిత్రం డబ్బింగ్‌ కార్యక్రమాలు స్టార్టయ్యాయి. శంకర్‌ మాట్లాడుతూ– ‘‘మలయాళంలో రికార్డ్‌ స్థాయిలో వసూళ్లను రాబట్టిన ‘2 కంట్రీస్‌’ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేయడం ఆనందంగా ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమాలో సరికొత్త సునీల్‌ను ప్రేక్షకులు చూడబోతున్నారు. త్వరలోనే చిత్రం టైటిల్, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లను విడుదల చేస్తాం’’ అన్నారు. నరేశ్, షియాజీ షిండే, పోసాని తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్‌.

Advertisement

తప్పక చదవండి

Advertisement