గోవాకు సూపర్‌ మచ్చి

15 Feb, 2020 00:40 IST|Sakshi
రచితా రామ్, కల్యాణ్‌ దేవ్‌

నటుడు చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్‌దేవ్‌ హీరోగా పులి వాసు దర్శకత్వంలో రిజ్వాన్, ఖుషి నిర్మిస్తున్న చిత్రం ‘సూపర్‌ మచ్చి’. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కన్నడ భామ రచితా రామ్‌ నటిస్తున్నారు. సీనియర్‌ నటులు రాజేంద్ర ప్రసాద్, నరేష్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా టాకీ పార్టు ముగిసింది. ‘‘లవ్‌స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీ ఇది. ఇందులోని ఐదు పాటల్లో ఆల్రెడీ రెండు పాటలు పూర్తయ్యాయి. వచ్చేనెలలో గోవాలో మరో రెండు పాటలను చిత్రీకరించేందుకు ప్లాన్‌ చేస్తున్నాం’’ అని చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమాకు సంగీతం: తమన్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: మనోజ్‌ కుమార్‌ మావిళ్ల.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా