Sakshi News home page

డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి స్టార్ హీరోయిన్

Published Sat, Sep 26 2015 9:01 AM

డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి స్టార్ హీరోయిన్

ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాల్లో బిజీగా ఉండగానే భవిష్యత్తును ప్లాన్ చేసుకుంటున్నారు మన స్టార్స్. ఈ విషయంలో హీరోలు మాత్రమే కాదు హీరోయిన్లు కూడా ముందే ఉంటున్నారు. క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలన్న ఉద్దేశంతో వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ సమంత కూడా ఈ లిస్ట్లో చేరిపోయింది.

మిగతా హీరోయిన్లందరూ ఫ్యాషన్ రంగం మీద దృష్టిపెడుతుంటే  సమంత మాత్రం సినిమా రంగంలోనే వ్యాపారం ప్రారంభించింది. సూర్య హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 24 తెలుగు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ను సొంతం చేసుకుంది. తనే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను తెలుగులో తానే స్వయంగా విడుదల చేయాలని ప్లాన్ చేసుకుంటుంది.

మొదట ఈ సినిమా రైట్స్ యంగ్ హీరో నితిన్ తీసుకున్నట్టుగా వార్తలు వచ్చినా, ప్రస్తుతం ఆ రైట్స్ సమంత చేతికే వచ్చాయట. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా 24 సినిమాను తెలుగులో రిలీజ్ చేయబోయేది సమంతే అన్నటాక్ బలంగా వినిపిస్తుంది.

Advertisement
Advertisement