విఘ్నేష్‌శివ దర్శకత్వంలో సూర్య | Sakshi
Sakshi News home page

విఘ్నేష్‌శివ దర్శకత్వంలో సూర్య

Published Wed, Sep 7 2016 3:32 AM

విఘ్నేష్‌శివ దర్శకత్వంలో సూర్య

సినిమా తెరకెక్కే వరకూ చిత్ర పరిశ్రమలో అంతా భ్రమే. చిత్ర ప్రారంభమై ఆదిలోనో, అర్ధభాగంలోనో ఆగిపోయిన చిత్రాలు చాలా ఉన్నాయి. అందుకే సినిమా పరిశ్రమను మాయా ప్రపంచం అంటారు. ఇక విషయానికి వస్తే నటుడు సూర్య ప్రస్తుతం సింగం చిత్రానికి రెండవ సీక్వెల్ ఎస్-3ని పూర్తి చేసే పనిలో ఉన్నారు.అయితే తదుపరి  చిత్రం ఏమిటన్న విషయంపై గందరగోళం నెలకొంది. కొన్ని రోజుల క్రితం తన తదుపరి చిత్రం కబాలి ఫేమ్ రంజిత్ దర్శకత్వంలో ఉంటుందని తెలిపారు. ఆ తరువాత కొంభన్, మరుదు చిత్రాల దర్శకుడితో చిత్రం చేయనున్నట్లు ప్రచారం జరిగింది.
 
 తాజాగా నయనతార ప్రియుడిగా ప్రచారంలో ఉన్న విఘ్నేశ్‌శివ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. విజయ్‌సేతుపతి, నయనతార జంటగా నటించిన నానుమ్‌రౌడీదాన్ చిత్రానికి దర్శకత్వం వహించిన విఘ్నేశ్‌శివ ఆ తరువాత మరో చిత్రం చేయలేదు. నిర్మాత ఏఎం.రత్నం సంస్థలో చిత్రం చేయబోతున్నట్లు ఇందులో విజయ్‌సేతుపతి, నయనతార, త్రిష నటించనున్నట్లు ప్రచారం జరిగింది. ఆ తరువాత నయనతార తన ప్రియుడి కోసం తానే స్వంతంగా చిత్ర నిర్మాణం చేపట్టనున్నట్లు టాక్ స్ప్రెడ్ అయ్యింది.ఇందులో హీరోగా నటించడానికి నటుడు అజిత్‌కు రోజుకు కోటి ఇవ్వడానికి సిద్ధం అన్నట్లు మీడియాలో ప్రచారం జరిగింది.
 
 అదే విధంగా నటుడు విజయ్ కాల్‌షీట్స్ కూడా స్వయానా నయనతారనే అడిగినట్లు, అజిత్, విజయ్ ఇతర చిత్రాలతో బిజీగా ఉండడంతో ఇక చివరి ప్రయత్నంగా సూర్యను నటించమని కోరినట్లు కోడంబాక్కమ్ వర్గాల సమాచారం. సూర్య వర్గం అందుకు ముందు సంశయించినా ఈ తరువాత సూర్య గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఈ చిత్రాన్ని సూర్య తన కుటుంబ నిర్మాణ సంస్థ అయిన స్టూడియో గ్రీన్ పతాకంపై నిర్మించనున్నట్లు తెలిసింది. ఇందులో కథానాయకిగా నయనతార నటిస్తారా? లేదా?అన్నది మాత్రం సస్పెన్స్‌గా ఉంచారు. ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.
 

Advertisement
Advertisement