పోలీస్, గ్యాంగ్‌స్టర్‌ల అంతర్యుద్ధం | Sakshi
Sakshi News home page

పోలీస్, గ్యాంగ్‌స్టర్‌ల అంతర్యుద్ధం

Published Mon, Jan 28 2019 4:51 AM

surya asthamayam movie updates - Sakshi

సినిమా అంటే 24 శాఖల సమ్మేళనం. వాటిల్లో 11 శాఖలను నిర్వహించి అరుదైన ఫీట్‌ చేశారు బండి సరోజ్‌ కుమార్‌. ‘సూర్యాస్తమయం’ సినిమాకి ఆయన కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు, ఎడిటింగ్, సంగీతం, ఫైట్లు, ప్రొడక్షన్‌ డిజైనర్, కెమెరా శాఖలతో పాటు ప్రధాన పాత్రలో నటించి, దర్శకత్వం వహించడం విశేషం. ఓజో మీడియా పతాకంపై రఘు పిల్లుట్ల, రవికుమార్‌ సుదర్శి నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి ద్వితీయార్ధంలో విడుదల కానుంది. ఈ సందర్భంగా బండి సరోజ్‌కుమార్‌ మాట్లాడుతూ ‘‘ఒక పోలీస్‌కీ, గ్యాంగ్‌స్టర్‌కీ మధ్య జరిగే అంతర్యుద్ధమే ఈ సినిమాలో ప్రధాన కథాంశం.

పవర్‌ఫుల్‌ పోలీస్‌ పాత్రలో నేను, గ్యాంగ్‌స్టర్‌గా త్రిశూల్‌ రుద్ర యాక్ట్‌ చేశాం. తమిళ నటుడు డేనియల్‌ బాలాజీ కీలక పాత్ర పోషించారు. హైదరాబాద్, వికారాబాద్, నల్గొండ, రామోజీ ఫిల్మ్‌సిటీ, కడప, కర్ణాటకల్లో చిత్రీకరణ జరిపాం. ఇటీవల విడుదల చేసిన ‘ఉరిమే మేఘం స్నేహం, కురిసే వర్షం స్నేహం..’ పాటకు చాలా మంచి స్పందన వస్తోంది. మా సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. త్వరలోనే ట్రైలర్‌ని, ఫిబ్రవరిలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. త్రిశూల్‌ రుద్ర, హిమాన్సీ కాట్రగడ్డ, కావ్యా సురేశ్, డేనియల్‌ బాలాజీ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement