తిరుపుర సుందరి | Sakshi
Sakshi News home page

తిరుపుర సుందరి

Published Sat, Aug 8 2015 11:55 PM

తిరుపుర సుందరి

 ‘కలర్స్’ స్వాతిని తమిళనాట ఇకపై ‘తిరుపుర సుందరి’ అని పిలుస్తారేమో! ఎందుకంటే ఆ పేరుతో తమిళంలో ఓ సినిమా తయారైంది. ఇదే తెలుగులో ‘త్రిపుర’. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రాన్ని ‘గీతాంజలి’ ఫేం రాజ కిరణ్ దర్శకత్వంలో క్రేజీ మీడియా పతాకంపై ఎ.చినబాబు, ఎం. రాజశేఖర్ నిర్మిస్తున్నారు.  ప్రస్తుతం ఈ చిత్రం  నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. నిర్మాతలు  మాట్లాడుతూ-‘‘స్వాతి నటన ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది.

 ఇది యూనివర్శల్ సబ్జెక్ట్. అందుకే మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని నిర్మించే యోచనలో ఉన్నాం’’ అన్నారు. ‘‘నా తొలి చిత్రం ‘గీతాంజలి’కన్నా ఈ చిత్రం బాగుంటుంది. ఆ చిత్రానికి మించిన సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. ఆద్యంతం ప్రేక్షకులను అలరించేలా ఈ చిత్రాన్ని రూపొందించాం’’ అని రాజ కిరణ్ చెప్పారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: కోన వె ంకట్, పాటలు: చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, సంగీతం: కమ్రాన్.
 

Advertisement
Advertisement