తాప్సీ.. రోజుకు వంద సిగరెట్లు! | Sakshi
Sakshi News home page

తాప్సీ.. రోజుకు వంద సిగరెట్లు!

Published Fri, Jul 18 2014 1:59 PM

తాప్సీ.. రోజుకు వంద సిగరెట్లు!

గుండె ఝల్లుమంది అంటూ టాలీవుడ్లో తెరంగేట్రం చేసిన ఉంగరాల జుట్టు చిన్నది తాప్సీ. తెలుగు తెరపై పలువురు అగ్ర హీరోలతో చకచకా సినిమాలు చేసేస్తూ దూసుకెళ్తున్న ఈమె సిగరెట్లు కాలుస్తుందంటే మీరు నమ్ముతారా? మీరే కాదు.. స్వయంగా తాప్సీ కూడా ఆ విషయాన్ని నమ్మలేకపోతోంది. ఏంటి, అంతా గందరగోళంగా ఉందా?

తనను తాను ఇంతవరకు 'నాన్ స్మోకర్' అనుకుంటున్నానని, కానీ.. ఉబెర్ ఫాక్ట్స్ చెబుతున్న విషయం చూస్తే తాను కూడా తెగ పొగ తాగుతున్నట్లు అర్థమవుతోందని తాప్సీ తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఇంతకీ విషయం ఏమిటంటే.. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో ఒక్క రోజు గాలి పీలిస్తే.. ఒక రోజులో వంద సిగరెట్లు కాల్చినంత ఫలితం దక్కుతుందట. ఆ విషయం తెలిసే తాప్సీ తాను కూడా ఇప్పటికి ఎన్ని వందల సిగరెట్లు కాల్చిన ఫలితం అనుభవించానో అనుకుంటూ నిట్టూర్చింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement