ఆయన చాన్స్ ఇస్తానంటే నేనొద్దంటానా? | Sakshi
Sakshi News home page

ఆయన చాన్స్ ఇస్తానంటే నేనొద్దంటానా?

Published Sun, Feb 7 2016 10:10 PM

ఆయన చాన్స్ ఇస్తానంటే నేనొద్దంటానా?

ఏ ఆర్టిస్ట్‌కైనా ఫలానా దర్శకుడితో సినిమా చేయాలనే కల ఉంటుంది. కొంతమందికి ఆ కల నెరవేరుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమందికి నెరవేరదు. తాప్సీకి ఒకటి కాదు.. ఏకంగా రెండు కలలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. దక్షిణాది పరిశ్రమ గర్వించదగ్గ దర్శకునిగా పేరు తెచ్చుకున్న మణిరత్నం దర్శకత్వంలో ఏ ఆర్టిస్ట్ అయినా కనీసం ఒక్క సినిమాలో నటించే అవకాశం వచ్చినా చాలనుకుంటారు. తాప్సీకి కూడా ఆ కోరిక ఉంది. ‘‘మణిరత్నం దర్శకత్వం వహించే చిత్రాలకు నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆయన సినిమాలో నటించాలన్నది నా ఆశయం.

మణిరత్నం ఏ భాషలో సినిమా చేస్తున్నారన్నది నాకు ముఖ్యం కాదు. ఆ భాషలో నాకు అవకాశం ఇస్తే నేను కచ్చితంగా కాదనను. ఏదో ఒక రోజు ఆయన అవకాశం ఇస్తారని నమ్ముతున్నాను’’ అని తాప్సీ పేర్కొన్నారు.  హిందీ నటుడు హృతిక్ రోషన్ సరసన జత కట్టాలన్నది తాప్సీ మరో కోరిక. ‘‘ఒకవేళ హృతిక్ సరసన సినిమా చేసే అవకాశం వస్తే, అప్పుడు కళ్లు తిరిగి కింద పడిపోతానేమో’’ అని తాప్సీ అన్నారు. మరి... మణిరత్నం, హృతిక్ తాప్సీకి చాన్సిస్తారా? ఏమో... కాలమే చెప్పాలి.

Advertisement

తప్పక చదవండి

Advertisement