తాప్సీ... నువ్వేదో మంచి చేసి ఉంటావ్‌! | Sakshi
Sakshi News home page

తాప్సీ... నువ్వేదో మంచి చేసి ఉంటావ్‌!

Published Sun, Aug 6 2017 12:32 AM

తాప్సీ... నువ్వేదో మంచి చేసి ఉంటావ్‌! - Sakshi

 ఇలా తన గురించి తానే అంటున్నారు తాప్సీ. మంగళవారం తన పుట్టినరోజు జరుపుకున్నారామె. ఈ సందర్భంగా అభిమానుల నుంచి లెక్కలేనన్ని ‘బర్త్‌డే విషెస్‌’ అందుకున్నారు. ఆ ఆనందంలో తలమునకలవుతున్నారీ ఢిల్లీ బ్యూటీ. ఎమోషన్‌ని మాటల రూపంలో బయటపెట్టారు. ‘‘మీ (అభిమానులు) అందర్నీ నేరుగా కలసి, ధన్యవాదాలు తెలియజేయాలని ఉంది.

కానీ, అది సాధ్యం కాదు. అందుకే సోషల్‌ మీడియా ద్వారా నా ఆనందాన్ని పంచుకుంటున్నా. మీకు ధన్యవాదాలు చెప్పడానికి మాటలు లేవు. ‘తాప్సీ.. నువ్వేదో మంచి పని చేసి ఉంటావ్‌. అందుకే ఇంతమంది అభిమానాన్ని సంపాదించుకోగలిగావ్‌’ అని నన్ను నేను అభినందించుకుంటున్నాను. నటిగా తడబడుతూ అడుగులేసినప్పటి నుంచి ‘నటి’గా నిలదొక్కుకునే వరకూ నన్ను సపోర్ట్‌ చేశారు. చేస్తూనే ఉన్నారు. ఈ ప్రేమాభిమానాలతో ధైర్యంగా ముందుకెళతాను’’ అని తాప్సీ అన్నారు.

Advertisement
Advertisement