లెజెండరీ డైరెక్టర్ ఇకలేరు | Sakshi
Sakshi News home page

లెజెండరీ డైరెక్టర్ ఇకలేరు

Published Tue, Apr 2 2019 9:37 AM

Tamil Film Director Mahendran Passes Away - Sakshi

సాక్షి, చెన్నై : ప్రముఖ తమిళ దర్శకుడు జె. మహేంద్రన్‌(79) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న గత కొద్ది రోజులుగా అపోలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు ఉద‌యం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన తనయుడు జాన్‌ మహేంద్రన్‌ వెల్లడించారు. మహేంద్రన్‌ తమిళంలో అనేక హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించారు. శంకర్‌, మణిరత్నం వంటి ప్రముఖ దర్శకులకు మార్గదర్శకుడిగా నిలిచారు. ముల్లుమ్ మ‌ల‌రుమ్‌, జానీ, నెంజ‌తై కిల్లాడే చిత్రాలు మ‌హేంద్ర‌న్‌కి ఎంత‌గానో పేరు తెచ్చిపెట్టాయి.

రజనీకాంత్‌కు ఎక్కువ గుర్తింపు తెచ్చిన దర్శకుల్లో ఈయన ఒకరు. న‌టుడిగాను ప‌లు చిత్రాలలో న‌టించిన ఆయ‌న ఇటీవలే విజ‌య్ సేతుప‌తి సీతాకాతి, ర‌జ‌నీకాంత్ పేటా , బ్యూమ్రాంగ్ వంటి చిత్రాల‌లో క‌నిపించారు. 2018లో ఆయ‌న లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు కూడా అందుకున్నారు. 80 చిత్రాలకు దర్శకత్వం వహించిన మహేంద్రన్‌ రెండు సార్లు జాతీయ అవర్డును అందుకున్నారు. ఆయ‌న మ‌ర‌ణంతో త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ షాక్‌కి గుర‌యింది. ఆయ‌న ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని ప‌లువురు ప్ర‌ముఖులు ప్రార్ధిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఆయన అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement
Advertisement