తిరుగులేని తాన్హాజీ, మరో రికార్డు దిశగా

21 Jan, 2020 09:54 IST|Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవ్‌గన్‌ మరాఠా యోధుడిగా నటించిన చిత్రం ‘తాన్హాజీ: ది అన్‌సంగ్‌ వారియర్‌’. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నిజజీవితంలో భార్యాభర్తలైన అజయ్ దేవగన్, కాజోల్ రీల్ లైఫ్‌లో భార్యాభర్తలుగా నటించారు. ఈ సినిమా అందరినీ ఆశ్చర్యపరుస్తూ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఇక జనవరి 10న విడుదలైన ఈ చిత్రం 11 రోజుల్లోనే రూ.175 కోట్లు కురిపించింది. అదే రోజు విడుదలైన ‘ఛపాక్‌’ ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోయింది. ఎన్ని ప్రమోషన్లు చేసినప్పటికీ ఛపాక్‌.. తాన్హాజీ ధాటికి ఎదురునిలవలేకపోయింది.

ఇక తాన్హాజీ చిత్రానికి మహారాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా రెండో వారంలోనూ ధీటుగా వసూళ్లు రాబడుతుండటంతో రూ.200 కోట్లను అందుకోవడం ఖాయమని ఆయన అభిమానులు తేల్చి చెప్తున్నారు. తాన్హాజీ రిలీజైన మూడు రోజులకే హాఫ్‌ సెంచరీ, ఆరు రోజులకే సెంచరీ కొట్టగా మరిన్ని రికార్డులు బద్ధలు చేసే దిశగా వసూళ్ల కొనసాగుతున్నాయి. ఇక ఈ చారితత్రాత్మక చిత్రం అజయ్‌ దేవ్‌గన్‌ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది.

చదవండి:

ఆరు రోజుల్లో రూ. 107 కోట్లు.. థాంక్యూ!

తాన్హాజీ: కలెక్షన్ల తుఫాన్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రజల్లో మార్పుతోనే కరోనా దూరం: రష్మి గౌతమ్‌

నా వంతు విరాళం సేకరిస్తున్నాను

బర్త్‌డేకి టైటిల్‌?

ఇంట్లోనే ఉందాం.... కరోనాను దేశం దాటిద్దాం

‘స్టార్‌ వార్స్‌’ నటుడు కరోనాతో మృతి

సినిమా

నా వంతు విరాళం సేకరిస్తున్నాను

బర్త్‌డేకి టైటిల్‌?

ఇంట్లోనే ఉందాం.... కరోనాను దేశం దాటిద్దాం

‘స్టార్‌ వార్స్‌’ నటుడు కరోనాతో మృతి

ఆర్జీవీ... ఓ రామబాణం

అందుకే తప్పుకున్నా