సంసారంలో సరిగమలు | Sakshi
Sakshi News home page

సంసారంలో సరిగమలు

Published Tue, Jun 30 2015 10:40 PM

సంసారంలో సరిగమలు

 ఓ జంట తమకు ఎదురైన సమస్యలను ఎలా పరిష్కరించుకుందనే కథాంశంతో  తెరకెక్కుతున్న చిత్రం ‘సీతా శ్రీరాం’. వర్ష ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో ఆడెపు రవీందర్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్నారు. శ్వేత కథానాయిక. రమేశ్ ముక్కర స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాటలను ఆవిష్కరించారు. ‘‘ఆలుమగల మధ్య జరిగే సంఘటనల సమాహారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం’’ అని దర్శకుడు చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్, దర్శకుడు రాజా వన్నెంరెడ్డి  తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement