థాంక్యూ హృతిక్ : రానా | Sakshi
Sakshi News home page

థాంక్యూ హృతిక్ : రానా

Published Sun, Nov 6 2016 12:59 PM

థాంక్యూ హృతిక్ : రానా

సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న టాలీవుడ్ యంగ్ హీరో రానా. తెలుగు హీరోనే అయినా బాలీవుడ్ మ్యాన్లీ స్టార్ లకు ఏ మాత్రం తీసిపోని ఫిజిక్ రానా సొంతం అందుకే ఈ కండల వీరుడికి ఉత్తరాదిలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్ లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన రానాకు అక్కడి స్టార్ హీరోలతో మంచి అనుబంధం ఉంది.

రానా.., బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ గురించి చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హృతిక్ కంపెనీ ప్రాడక్ట్స్ అయిన హెచ్ఆర్ఎక్స్ గూడీస్ ఫోటోను ట్వీట్ చేసిన రానా, ' థాంక్యూ హృతిక్, మీ హెచ్ఆర్ఎక్స్ గూడీస్ తిరిగి ఇంటికి వచ్చేశాయి' అంటూ కామెంట్ చేశాడు. అయితే ఈ గూడ్స్ రానాకు హృతిక్ గిఫ్ట్ గా ఇచ్చాడా..? లేదా..? అన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

Advertisement

తప్పక చదవండి

Advertisement