ప్రతిభే కొలమానం | Sakshi
Sakshi News home page

ప్రతిభే కొలమానం

Published Sat, Jul 5 2014 1:35 AM

ప్రతిభే కొలమానం - Sakshi

నటికి అందం కంటే కూడా ప్రతిభే ముఖ్యం అంటున్నారు సంచలన నటి శ్రుతి హాసన్. పద్మభూషణ్ కమలహాసన్ పాత్రలకు ప్రాణం పోయడానికి ఎంతగా తపిస్తారో ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే ఆయన వారసురాలిగా రంగప్రవేశం చేసిన నటి శ్రుతి హాసన్ ఒక పాత్రలో నటించడానికి ఒక్కసారి కమిట్ అయితే అది ఎలాంటి విమర్శలకు దారి తీసేదైనా సరే నటించి తీరుతారు. అలా బాలీవుడ్ చిత్రం ‘డి డే’లో వేశ్యగా నటించి వృత్తిపై తన అంకిత భావాన్ని నిరూపించుకున్నారు.

ఆదిలో అపజయాలు చవి చూసినా శ్రుతి  ఇప్పుడు మోస్ట్ సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా ఎదిగారు. ఇటీవలే ఒక ఆంగ్ల పత్రిక సర్వేలో అత్యంత పాపులర్ హీరోయిన్‌ల జాబితాలో మొదటిస్థానంలో నిలిచారు. ఈ విషయం తెలియగానే సంతోషంతో మునిగిపోయిన శ్రుతి హాసన్ స్పందిస్తూ అందం అనేది వయసుకు సంబంధించిందన్నారు.

ఒక్క అందంతోనే అందరి దృష్టిని ఆకర్షించి పాపులర్ కాలేమన్నారు. అందం కంటే ప్రతిభే ముఖ్యం అని పేర్కొన్నారు. అధికంగా శారీరక కసరత్తులతో పాటు ఆహార నియమాలు పాటిస్తున్నానన్నారు. అయినా తానింత అందంగా వున్నానంటే అందుకు తన తల్లిదండ్రులే కారణం అని పేర్కొ న్నారు. అందుకు వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు శృతి అన్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో విశాల్ సరసన పూజై చిత్రంలో నటిస్తున్నారు.

Advertisement
Advertisement