బాలయ్యకు తేడా టైటిల్ ఓకేనా..? | Sakshi
Sakshi News home page

బాలయ్యకు తేడా టైటిల్ ఓకేనా..?

Published Tue, Jun 6 2017 11:10 AM

బాలయ్యకు తేడా టైటిల్ ఓకేనా..?

గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో ఘనవిజయం సాధించిన నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 101వ సినిమాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య సరికొత్త లుక్లో డాన్గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోర్చుగల్లో షూటింగ్ జరుపుకుంటోంది. బాలకృష్ణ సరసన శ్రియ, ముస్కాన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఇంత వరకు టైటిల్ నిర్ణయించలేదు.

షూటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి ఈ సినిమాకు ఉస్తాద్ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారన్న వార్తలు వినిపించాయి. తరువాత జై బాలయ్య అనే టైటిల్ కూడా తెర మీదకు వచ్చింది. తాజాగా మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. చిత్ర నిర్మాతలు జై బాలయ్య, ఉస్తాద్తో పాటు 'తేడా సింగ్' అనే టైటిల్ను కూడా రిజిస్టర్ చేయించటంతో బాలయ్య సినిమాకు ఈ టైటిల్ను కూడా పరిశీలిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.

అంతేకాదు తేడా సింగ్ అనే టైటిల్లో పూరి మార్క్ కనిపిస్తుందని దాదాపు ఇదే టైటిల్ ఫిక్స్ అని భావిస్తున్నారు. మాస్ ఆడియన్స్లో  తిరుగులేని ఇమేజ్ ఉన్న బాలయ్యకు తేడా సింగ్ అనే టైటిల్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుంది. ఇలాంటి టైటిల్ను ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారన్న అన్న అనుమానం కూడా కలుగుతోంది. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే ఫస్ట్ లుక్ రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ నెల 10న బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు.

Advertisement
Advertisement