గన్‌దరగోళం | Sakshi
Sakshi News home page

గన్‌దరగోళం

Published Fri, Aug 2 2019 12:29 AM

Tiger Shroff introduces Gatling gun to Bollywood - Sakshi

హృతిక్‌ రోషన్, టైగర్‌ ష్రాఫ్‌ ఒకరి మీద ఒకరు యుద్ధం ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. హృతిక్‌ను ఢీ కొట్టడానికి టైగర్‌ ప్రపంచంలోనే పవర్‌ఫుల్‌ మెషీన్‌గన్‌ ‘గాట్లింగ్‌’తో వాడబోతున్నారని తెలిసింది. హృతిక్‌ రోషన్, టైగర్‌ ష్రాఫ్‌ హీరోలుగా సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కిస్తున్న యాక్షన్‌ చిత్రం ‘వార్‌’. యశ్‌ చోప్రా ఫిల్మ్స్‌ నిర్మిస్తోంది. యాక్షన్‌ చిత్రాల ప్రేమికులకు కనువిందులా ఉండేందుకు అద్భుతమైన లొకేషన్స్‌లో యాక్షన్‌ సీన్లు చిత్రీకరించారు. ఓ సన్నివేశంలో ఈ మెషీన్‌గన్‌తో సిటీని ధ్వంసం చేస్తూ గన్‌దరగోళం సృష్టిస్తారట టైగర్‌. ఈ సీన్స్‌ సినిమాకు ఓ హైలైట్‌గా నిలుస్తాయట. వాణీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లోనూ రిలీజ్‌ కానుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement