క్రిస్మస్‌ విషెస్‌ తెలిపిన టాలీవుడ్‌ స్టార్స్‌

25 Dec, 2019 14:28 IST|Sakshi

సెలబ్రిటీలు ఏది చేసినా సెన్సేషనే.. అలాంటిది పండగ వచ్చిందంటే మన సెలబ్రిటీలు చేసే హంగామా మామూలుగా ఉండదు. పండగ సందర్భంగా పలువురు సినీనటులు ఫొటోలు షేర్‌ చేస్తూ అభిమానులకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ఈ పండగకు ఇచ్చిపుచ్చుకోవడంలో ఉన్న ప్రేమను, అనుభూతిని ఆస్వాదించండి, నచ్చినవారితో కలిసి పండగను ఎంజాయ్‌ చేయండి. వీలైనన్ని జ్ఞాపకాలను కూడగట్టుకోండి’ అని టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు అభిమానులకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపాడు. ఇక మెగాస్టార్‌ చిరంజీవి తన మనవరాళ్లతో కలిసి విషెస్‌ క్రిస్మస్‌తోపాటు నూతన సంవత్సర విషెస్‌ తెలిపాడు. హీరో రామ్‌చరణ్‌ కూడా తన తండ్రి చిరుతో కలిసి పండగ వేడుకల్లో పాల్గొన్నాడు.

హీరోయిన్‌ సమంత ప్రత్యుష ఫౌండేషన్‌ పిల్లలతో కలిసి క్రిస్మస్‌ వేడుకలు జరుపుకుంది. ‘ఎవరైతే తమ జీవితాల్లో వెలుగు కోసం ఎదురుచూస్తారో వారితో కలిసి క్రిస్మస్‌ను సెలబ్రేట్‌ చేసుకున్నప్పుడే ఆ పండగకు పూర్తి అర్థం ఉంటుంద’ని ఆమె పేర్కొంది. మరో నటి కేథరిన్‌ పిజ్జాతో క్రిస్మస్‌ను సెలబ్రేట్‌ చేసుకుంది. సాంటాక్లాజ్‌లా రెడీ అయిన హీరోయిన్‌ రెజీనా.. తనకు డిసెంబర్‌ నెల ఎంతో ప్రత్యేకమని చెప్పుకొచ్చింది. తన పుట్టినరోజు(డిసెంబర్‌ 13), క్రిస్మస్‌, రానున్న కొత్తసంవత్సరం కోసం ప్రారంభమయ్యే వేడుకలు అన్నీ ఈ నెలలోనే జరుగుతాయని, అందుకే ఈ నెల తనకెంతో ఇష్టమని పేర్కొంది. అయితే ఈ సంవత్సరం ఎంతో బిజీగా ఉన్నా పండగ జరుపుకోవడం మాననంటోంది.

‘ఈ క్రిస్మస్‌ మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎన్నో సంతోషాలను, ప్రేమను, అదృష్టాలను అందించాలని కోరుకుంటున్నాను’ అని మంచు మనోజ్‌ విషెస్‌ తెలిపాడు. నిర్మాత, నటి మంచు లక్ష్మీ అభిమానులకు క్రిస్మస్‌ పండగ శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబంతో కలిసి ఈ పండగను ఆస్వాదించండన్నారు. ఇక జూ. ఎన్టీఆర్‌, ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, కాజల్‌ అగర్వాల్‌ పలువురు నటీనటులు క్రిస్మస్‌ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా