స్క్రీన్‌ టెస్ట్‌ | Sakshi
Sakshi News home page

స్క్రీన్‌ టెస్ట్‌

Published Fri, Jul 27 2018 2:31 AM

tollywood movies special screen test - Sakshi

1. నితిన్‌ హీరోగా రాశీఖన్నా హీరోయిన్‌గా ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది.  ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ దర్శకత్వంలో 1987లోనే ఇదే పేరుతో సినిమా విడుదలైంది.     ఆ సినిమాలో హీరో ఎవరో తెలుసా?
ఎ) నాగార్జున    బి) వెంకటేశ్‌  సి) బాలకృష్ణ     డి) అర్జున్‌

2. ‘భాస్కీ’ అనే స్టైలిస్ట్‌ ఈ ప్రముఖ హీరోకి చిన్ననాటి స్నేహితుడు. ఆయన అసలు పేరు భాస్కర్‌.    ఆ హీరోకి ఇతను డిజైనర్‌గా పనిచేస్తాడు. ఆ ప్రముఖ హీరో ఎవరో తెలుసా?
ఎ) రామ్‌చరణ్‌    బి) ఎన్టీఆర్‌    సి) ప్రభాస్‌   డి) మహేశ్‌బాబు

3. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘పెళ్లి సందడి’ సినిమాలో ఓ హీరోయిన్‌గా తెలుగమ్మాయి రవళి నటించారు. మరో హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా?
ఎ) దీప్తీ భట్నాగర్‌ బి) సోనాలీ బింద్రే   సి) శిల్పా శెట్టి    డి) రవీనా టాండన్‌

4. ‘ప్రతిధ్వని’ దర్శకునిగా బి.గోపాల్‌కు మొదటి చిత్రం.     ఆ చిత్రంలోని అతి ముఖ్యమైన ‘ఇన్‌స్పెక్టర్‌ ఝాన్సీ’ పాత్రను పోషించిన నటి ఎవరో తెలుసా?
ఎ) వాణిశ్రీ           బి) శారద   సి) విజయశాంతి  డి) జయప్రద

5. ‘దాన వీర శూర కర్ణ’ చిత్రం లోని ‘చిత్రం భళారే విచిత్రం...’అనే పాటలో ఎన్టీఆర్‌తో కలిసి ఆడిపాడిన ప్రముఖ నటి ఎవరో తెలుసా?
ఎ) కె.ఆర్‌.విజయ   బి) ప్రభ   సి) జయసుధ  డి) ఎల్‌.విజయలక్ష్మీ

6. నటుడిగా తన రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభమైందని జగపతిబాబు చెప్పుకునే సినిమా ఏది? (ఆ సినిమాలో ఆయన ప్రతినాయకుడిగా నటించారు)
ఎ) సింహా   బి) శ్రీమన్నారాయణ    సి) నాన్నకు ప్రేమతో    డి) లెజెండ్‌

7. అక్కినేని, సావిత్రిలది హిట్‌ కాంబినేషన్‌ అని తెలిసిందే. వారిద్దరూ కలిసి ఎన్ని సినిమాల్లో నటించారో తెలుసా?
ఎ) 36   బి)  30    సి) 29    డి) 32

8. మహేశ్‌బాబు కూతురు పేరు ‘సితార’. ఈ చిన్నారి బర్త్‌డే జూలై 22న. ఈ సంవత్సరం ఆ పాప ఎన్నో ఏట కాలు పెట్టిందో తెలుసా?
ఎ) 5     బి) 6     సి) 4     డి) 7

9. ‘ఆర్‌ ఎక్స్‌100’ సినిమా మంచి కమర్షియల్‌ హిట్‌ సాధించింది. ఈ సినిమాతో దర్శకునిగా మంచి పేరు తెచ్చుకున్నదెవరో తెలుసా?
ఎ) రాకేశ్‌ శశి   బి) అజయ్‌ భూపతి  సి) వెంకీ కుడుముల    డి) మహి.వి.రాఘవ్‌

10. ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా’. ఆ చిత్రంలో విలన్‌గా నటిస్తున్న కన్నడ నటుడు ఎవరో కనుక్కోండి?
ఎ) ఉపేంద్ర      బి) సుదీప్‌   సి) శివ రాజ్‌కుమార్‌   డి) రవిశంకర్‌

11. మోస్ట్‌ పాపులర్‌ డాన్సర్‌గా పేరు తెచ్చుకున్న ‘సిల్క్‌ స్మిత’ ఏ సంవత్స రంలో తనువు చాలిం చారో తెలుసా?
ఎ) 1990     బి) 1998    సి) 1996     డి) 1992

12. 1983లో వచ్చిన ‘ఖైదీ’ చిత్రం ద్వారా కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న దర్శకుడెవరో తెలుసా?
ఎ) ఎ. కోదండ రామిరెడ్డి    బి) కె. రాఘవేంద్రరావు    సి) కోడి రామకృష్ణ     డి) దాసరి నారాయణరావు

13. ‘గుండెల్లో గోదారి’ చిత్రంలో లక్ష్మీ మంచు లీyŠ  రోల్‌ చేశారు. మరో హీరోయిన్‌ కూడా ఈ చిత్రంలో ఉన్నారు. ఆమె ఎవరో తెలుసా?
ఎ) తాప్సీ       బి) శ్రద్ధాదాస్‌    సి) హన్సిక     డి) స్నేహ
14. ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రంలో హీరో విజయ్‌ దేవరకొండ నానమ్మగా కనిపించిన ప్రముఖ నటి ఎవరో తెలుసా?
ఎ) లక్ష్మీ                   బి) కాంచన   సి) షావుకారు జానకి   డి) జమున

15. ‘విలేజ్‌లో వినాయకుడు’ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన బ్యూటీ ఎవరో తెలుసా?
ఎ) ఈషా రెబ్బా బి) శరణ్యా మోహన్‌ సి) సోనియా డి) పూనమ్‌ కౌర్‌

16. ‘జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది...’అనే పాట రచయిత ఎవరో తెలుసా?
ఎ) సిరిÐð న్నెల      బి) చంద్రబోస్‌   సి) రామజోగయ్య శాస్త్రి    డి) అనంత శ్రీరామ్‌

17. మిస్‌ యూనివర్స్‌ 2010లో రన్నరప్‌గా నిలిచిన ఈ బ్యూటీ మోడలింగ్‌ టు యాక్టింగ్‌కి వచ్చారు. ఎవరామె?
ఎ) ప్రియాంకా చోప్రా  బి) కృతీ సనన్‌   సి) పూజా హెగ్డే    డి) ఆలియా భట్‌

18. 1974లో విడుదలైన ‘దేవదాసు’ చిత్రానికి దర్శకత్వం వహించింది ఎవరో తెలుసా?
ఎ) కృష్ణ         బి) విజయనిర్మల   సి) పి.సి. రెడ్డి    డి) కె.యస్‌.ఆర్‌. దాస్‌

19. ఈ ఫొటోలోని నటి పేరేంటో తెలుసా?
ఎ) ఫటాఫట్‌ జయలక్ష్మీ   బి) జయంతి    సి) గీతాంజలి    డి) రమాప్రభ

20. ఈ కింది ఫొటోలో ఉన్న పాప ఇప్పుడు బాలీవుడ్‌లో బిజీ నటి ఎవరో గుర్తించండి.
ఎ) దీపికా పదుకోన్‌ బి) కత్రినా కైఫ్‌   సి) దిశా పటానీ    డి) సోనాలీ బింద్రే

మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం     
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే...   మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్‌
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే...  ఇంకోసారి ఈ క్విజ్‌ చదవకండి!

సమాధానాలు
1) బి 2) సి 3) ఎ 4) బి 5) బి 6) డి 7) ఎ 8) బి 9) బి 10) బి
11) సి 12) ఎ 13) ఎ 14) బి 15) బి 16) ఎ 17) సి 18) బి 19) ఎ 20) బి


నిర్వహణ: శివ మల్లాల

Advertisement
Advertisement