స్క్రీన్‌ టెస్ట్‌ | Sakshi
Sakshi News home page

స్క్రీన్‌ టెస్ట్‌

Published Fri, Aug 10 2018 5:09 AM

tollywood movies special screen test - Sakshi

1. మహేశ్‌బాబు ఏ సంవత్సరంలో పుట్టారో కనుక్కోండి?
ఎ) 1974    బి)1976  సి)1975  డి)1979

2. మహేశ్‌బాబును ‘రాజకుమారుడు’ చిత్రంతో హీరోగా పరిచయం చేసిన నిర్మాత ఎవరు?
ఎ) యం.యస్‌. రాజు   బి) సి. అశ్వనీదత్‌  సి) మంజుల  డి) అల్లు అరవింద్‌

3. ‘నానీ’ చిత్రంలో మహేశ్‌బాబు సరసన నటించిన బాలీవుడ్‌ బ్యూటీ ఎవరో తెలుసా?
ఎ) అమీషా పటేల్‌   బి) సోనాలీ బింద్రే  సి) బిపాసా బసు  డి) ప్రీతీ జింటా

4. ‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాక్‌ అవుతుందో వాడే పండుగాడు..’ అని మహేశ్‌ చెప్పిన డైలాగ్‌ ఏ సినిమాలోనిది?
ఎ) అతడు     బి) ఖలేజా  సి) పోకిరి  డి) సైనికుడు

5. మహేశ్‌బాబు తనని తాను మొదటిసారి స్క్రీన్‌ మీద చూసుకున్న చిత్రం ‘నీడ’. ఏ దర్శకుడు మహేశ్‌ను అరంగేట్రం చేశారో తెలుసా?
ఎ) దాసరి నారాయణరావు  బి) కె. మురళీ మోహన్‌రావు  సి) కోడి రామకృష్ణ  డి) కృష్ణ

6. రాక్‌స్టార్‌ పాత్రలో మహేశ్‌బాబు నటించిన చిత్రం ‘1 నేనొక్కడినే’. ఆ చిత్రానికి కెమెరామెన్‌ ఎవరో తెలుసా?
ఎ) కేకే సెంథిల్‌ కుమార్‌   బి) మధి  సి) ఛోటా.కె. నాయుడు  డి) రత్నవేలు

7. మహేశ్‌బాబు నటి నమ్రతను ఏ సినిమా షూటింగ్‌ జరుగుతున్నప్పుడు పెళ్లి చేసుకున్నారో తెలుసా?
ఎ) వంశీ    బి) ఒక్కడు  సి) మురారీ  డి) అతడు

8. మహేశ్‌బాబు ‘పోరాటం’, ‘గూఢచారి 117’ సినిమాల్లో బాలనటుడిగా నటించారు. ఈ రెండు చిత్రాలకు దర్శకుడెవరు?
ఎ) కోడి రామకృష్ణ  బి) ఎ. కోదండ రామిరెడ్డి  సి) కేయస్‌ఆర్‌ దాస్‌  డి) కె.బాపయ్య

9. ఈ దర్శకుడు మహేశ్‌బాబుకు క్లోజ్‌ ఫ్రెండ్‌. మహేశ్‌బాబు ఫ్యామిలీతో విదేశాలకు విహార యాత్రలకు వెళ్లినప్పుడు ఈ దర్శకునికి మాత్రమే ఎంట్రీ ఉంటుంది. ఎవరా దర్శకుడు తెలుసా?
ఎ) పూరి జగన్నాథ్‌  బి) మెహర్‌ రమేశ్‌  సి) శివ కొరటాల  డి) త్రివిక్రమ్‌

10. ‘శ్రీమంతుడు’ సినిమాలో చేసిన పాత్ర ఇన్సిపిరేషన్‌తో మహేశ్‌బాబు ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆ గ్రామం తెలంగాణా ప్రాతంలోని ఏ జిల్లాలో ఉందో తెలుసా?
ఎ) మహబూబ్‌ నగర్‌  బి) అదిలాబాద్‌    సి) వరంగల్‌   డి) రంగారెడ్డి

11. మహేశ్‌బాబు ఇప్పటి వరకూ ఎన్ని సినిమాలకు వాయిస్‌ ఓవర్‌ అందించారో కనుక్కోండి?
ఎ) 2  బి) 1  సి) 6   డి) 4

12. మహేశ్‌బాబు తన కెరీర్‌లో ఒకే ఒక్క దర్శకునితో మూడు సినిమాల్లో నటించారు. ఆ దర్శకుడెవరు?   ఎ) శ్రీకాంత్‌ అడ్డాల
బి) పూరి జగన్నాథ్‌  సి) శ్రీను వైట్ల   డి) గుణశేఖర్‌

13. మహేశ్‌ నటించిన ‘శ్రీమంతుడు’, ‘భరత్‌ అనే నేను’.. ఈ రెండు సినిమాల్లోని పాటలన్నీ రాసిన రచయిత ఎవరో తెలుసా?
ఎ) శ్రీమణి  బి) రామజోగయ్య శాస్త్రి  సి) సిరివెన్నెల  డి) చంద్రబోస్‌

14. ‘పోకిరి’ సినిమాలోని ‘గల గల పారుతున్న గోదారిలా...’ పాటను పాడిన   సింగర్‌ పేరేంటి?
ఎ) హేమచంద్ర    బి) నిహాల్‌  సి) సింహా  డి) కార్తీక్‌

15. బెస్ట్‌ డెబ్యూ హీరో, బెస్ట్‌ హీరో, స్పెషల్‌ జ్యూరీ అన్ని కేటగిరీలకు కలిపి మహేశ్‌బాబు మొత్తం ఎన్ని నందులను అందుకున్నారో తెలుసా?
ఎ) 4    బి) 8  సి) 6    డి) 9

16. మహేశ్‌బాబుని ట్వీటర్‌లో దాదాపు 68లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఆయన ట్వీటర్‌ హ్యాండిల్‌ ఏంటో తెలుసా?
ఎ) మీ మహేశ్‌  బి) యువర్స్‌ మహేశ్‌  సి) మహేశ్‌  డి) యువర్స్‌ ట్రూలీ మహేశ్‌

17. మహేశ్‌ కెరీర్‌లో ఇద్దరు హీరోయిన్లతో మాత్రమే రెండుసార్లు నటించారు. ఆ ఇద్దరిలో ఓ హీరోయిన్‌ త్రిష. మరి రెండో హీరోయిన్‌ ఎవరు?
ఎ) నమ్రతా శిరోద్కర్‌  బి) భూమిక    సి) తమన్నా  డి) సమంతా

18. మహేశ్‌బాబు స్కూలింగ్‌ చెన్నైలో జరిగింది. అదే స్కూల్లో చదువుకున్న తన జూనియర్‌ తమిళ సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో. ఆ హీరో ఎవరో కనుక్కోండి?
ఎ) సూర్య    బి) విజయ్‌  సి) ధనుష్‌    డి) కార్తీ

19. ప్రస్తుతం మహేశ్‌బాబు నటిస్తున్న ‘మహర్షి’లో  కీలక పాత్ర చేస్తున్న కామెడీ హీరో ఎవరు?
ఎ) ‘అల్లరి’ నరేశ్‌  బి) రాజేంద్రప్రసాద్‌  సి) సునీల్‌   డి) సప్తగిరి

20 మహేశ్‌బాబు బాలనటుడిగా నటించిన ఈ స్టిల్‌ ఏ సినిమాలోనిది?
ఎ) నీడ   బి) కొడుకు దిద్దిన కాపురం  సి) బాలచంద్రుడు   డి) పోరాటం

మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం     
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే...   మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్‌
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే...  ఇంకోసారి ఈ క్విజ్‌ చదవకండి!

సమాధానాలు
1) సి 2) బి 3) ఎ 4) సి 5) ఎ 6) డి 7) డి 8) ఎ 9) బి  10) ఎ 11) డి
12) డి 13) బి14) బి 15) బి 16) డి 17) డి 18) డి 19) ఎ  20) బి

నిర్వహణ: శివ మల్లాల

Advertisement
Advertisement