ఆ స్టార్ హీరో చరణేనా..? | Sakshi
Sakshi News home page

ఆ స్టార్ హీరో చరణేనా..?

Published Thu, Jun 9 2016 9:46 AM

ఆ స్టార్ హీరో చరణేనా..? - Sakshi

అ..ఆ.. సినిమా సక్సెస్తో మంచి ఫాంలో ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ తన నెక్ట్స్ సినిమాల విషయంలో కూడా క్లారిటీ ఇచ్చేశాడు. అ..ఆ.. రిలీజ్కు ముందే తన నెక్ట్స్ సినిమా కూడా హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లోనే ఉంటుందంటూ ప్రకటించాడు త్రివిక్రమ్. ఈ సినిమాను పవన్ హీరోగా తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం పవన్ ఎస్ జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న హుషారు(వర్కింగ్ టైటిల్) సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ డిసెంబర్ నుంచి త్రివిక్రమ్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళతాడు.

ఇటీవల దిల్ రాజు ప్రకటించినట్టుగా త్వరలో ఓ స్టార్ హీరోతో త్రివిక్రమ్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై సినిమా తెరకెక్కనుంది. ఆ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ధృవ షూటింగ్లో బిజీగా ఉన్న చెర్రీ, ఆ తరువాత సుకుమార్ డైరెక్షన్లో ఫార్ములా ఎక్స్ సినిమాలో నటించనున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత దిల్ రాజు నిర్మాణంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో  తెరకెక్కబోయే సినిమా యూనిట్తో జాయిన్ అవుతాడు.

Advertisement
Advertisement