ఇద్దరమ్మాయిల ప్రేమకథ! | Sakshi
Sakshi News home page

ఇద్దరమ్మాయిల ప్రేమకథ!

Published Wed, Jul 8 2015 10:43 PM

ఇద్దరమ్మాయిల ప్రేమకథ! - Sakshi

 ‘‘ఇద్దరమ్మాయిలు ప్రేమించుకుంటే...? వింతగా ఉంది కదూ! ఇలాంటి కథకు థ్రిల్లింగ్ ఎలిమెంట్ జోడిస్తే.. అదే మా ‘ఎఫైర్’ మూవీ’’ అంటున్నారు నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ.   శ్రీరాజన్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని  భీమవరం టాకీస్ పతాకంపై  తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించారు. ప్రశాంతి, గీతాంజలి ముఖ్యతారలు. ఈ సినిమా ప్రచార చిత్రాలను, మోషన్ పోస్టర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘తెలుగు తెరపై ఇప్పటి వరకూ రాని కథ ఇది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం’’ అని దర్శకుడు చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు బెక్కెం వేణుగోపాల్, ప్రతాని రామకృష్ణగౌడ్, నటులు ధనరాజ్, సిద్దార్ధ వర్మ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement