200మంది.. రెండున్నరేళ్ల కష్టం

3 Nov, 2017 00:37 IST|Sakshi

‘‘ఒక సినిమా చేయాలంటే 4 స్తంభాల్లాంటి వారి సపోర్ట్‌ కావాలి. ఆ నాలుగు స్తంభాలు నాకు ఉండటంతో ‘వానవిల్లు’ సినిమా చేయగలిగా. 200 మంది రెండున్నరేళ్ల కష్టమే ఈ సినిమా. ఈ నెలలోనే విడుదల చేయనున్నాం’’ అని లంకా ప్రతీక్‌ప్రేమ్‌ కరణ్‌ అన్నారు. ఆయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన సినిమా ‘వానవిల్లు’. శ్రావ్యా రావు, విశాఖ హీరోయిన్స్‌. లంకా కరుణాకర్‌ దాస్‌ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని నటుడు కాశీ విశ్వనాథ్‌ రిలీజ్‌ చేశారు. కరుణాకర్‌ దాస్‌ మాట్లాడుతూ– ‘‘ఎన్‌హెచ్‌ 7’ సినిమా తర్వాత నా తనయుడు ప్రతీక్‌ చేసిన చిత్రమిది.

సమాజానికి ఉపయోగపడేలా ఒక సినిమా చేయాలనుకొని ఈ చిత్రం చేశాం. ఫ్యామిలీ, యూత్, సమాజానికి ఏం కావాలో అన్ని అంశాలు మా సినిమాలో ఉన్నాయి’’ అన్నారు. ‘‘తమిళ దర్శకుడు సుందర్‌ రాజేంద్రన్‌ క్వాలిటీస్‌ ప్రతీక్‌లో కనిపిస్తున్నాయి. చాలా క్లారిటీగా సీన్స్‌ తీశాడు. టైటిల్‌లో క్లాస్, ట్రైలర్‌లో మాస్‌ కనిపిస్తోంది’’ అన్నారు కాశీ విశ్వనాథ్‌. చిత్ర సంగీతదర్శకుడు ప్రభు, డైరెక్టర్‌ చిన్నికృష్ణ, మ్యూజిక్‌ డైరెక్టర్‌ సాయి కార్తీక్, నటి అనితా చౌదరి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు