రయ్‌ రయ్‌

15 Apr, 2019 00:06 IST|Sakshi
వరలక్ష్మీ శరత్‌కుమార్‌

క్యారెక్టర్‌ నచ్చితే చాలు... హీరోయిన్‌గా, విలన్‌గా, సపోర్టింగ్‌ యాక్ట్రస్‌గా ఏ పాత్రలో అయినా ఒదిగిపోగల సత్తాఉన్న నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌. తన తర్వాతి చిత్రం కోసం ఆమె బైక్‌ ఎక్కారు.. అదేనండీ.. రేసర్‌గా మారారు అని చెబుతున్నాం. కె. వీరకుమార్‌ దర్శకత్వంలో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం ‘చేజింగ్‌’. తమిళ న్యూ ఇయర్‌ సందర్భంగా ఈ సినిమాలోని ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు టీమ్‌. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ మలేసియాలో జరుగుతోంది. ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు తీస్తున్నారు. మరి... వెండితెరపై బైక్‌ రేసర్‌గా రయ్‌ రయ్‌ అంటున్న వరలక్ష్మి స్పీడ్‌ ఎంతో తెలియాంటే కొన్ని రోజులు ఆగకతప్పదు. యమున, బాల, జెర్రోల్డ్, రఘు కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు దాసి సంగీత దర్శకుడు.

మరిన్ని వార్తలు