హిట్ కాంబినేషన్‌తో... మారుతి | Sakshi
Sakshi News home page

హిట్ కాంబినేషన్‌తో... మారుతి

Published Wed, Dec 16 2015 11:10 PM

హిట్ కాంబినేషన్‌తో... మారుతి

‘లక్ష్మి’, ‘తులసి’ తర్వాత  మళ్ళీ వెంకటేశ్, నయనతారల హిట్ కాంబినేషన్‌లో ఇప్పుడు ఓ కొత్త సినిమా మొదలైంది. మారుతి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ఆరంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత డి.సురేశ్‌బాబు స్విచాన్ చేయగా, అగ్ర నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు.

ఈ సందర్భంగా నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ -‘‘గురువారం నుంచి రెగ్యులర్  షూటింగ్ ప్రారంభమవుతుంది. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. సంగీత దర్శకుడు జిబ్రాన్ ఇప్పటికే మూడు పాటలకు ట్యూన్లిచ్చారు. ఈ చిత్రానికి ఛాయాగ్ర హణం: వివేక్ ఆనంద్, సమర్పణ: ఎస్.రాధాకృష్ణ.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement