పూరి డైరెక్షన్లో వెంకీ | Sakshi
Sakshi News home page

పూరి డైరెక్షన్లో వెంకీ

Published Sat, May 7 2016 12:53 PM

పూరి డైరెక్షన్లో వెంకీ - Sakshi

టాలీవుడ్ అగ్ర కథానాయకులు మైల్ స్టోన్ మూవీస్కి రెడీ అవుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమాను ప్రారంభించగా, నందమూరి బాలకృష్ణ కూడా 100వ సినిమాను రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఇదే లిస్ట్లో మరో సీనియర్ హీరో జాయిన్ అవుతున్నాడు. ఫ్యామిలీ హీరోగా టాలీవుడ్లో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా తన కెరీర్లో 75 సినిమాను భారీగా ప్లాన్ చేస్తున్నాడు.

ప్రస్తుతం తన 73వ సినిమాగా మారుతి దర్శకత్వంలో బాబు బంగారం సినిమాలో నటిస్తున్నాడు వెంకీ. ఈ సినిమా తరువాత నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో సినిమాను ఓకే చేశాడు. ఈ రెండు సినిమాల తరువాత తన 75 సినిమాను భారీగా తెరకెక్కించడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పటికే వెంకీ కోసం ఓ లైన్ సిద్ధం చేశాడట. వెంకీకి కూడా ఆ లైన్ నచ్చటంతో పూర్తి స్క్రీప్ట్ రెడీ చేయమన్నాడన్న టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం రోగ్ సినిమాను పూర్తి చేసిన పూరి, కళ్యాణ్ రామ్ హీరోగా మరో సినిమాను ప్రారంభించాడు. ఆ తరువాత ఎన్టీఆర్, మహేష్ బాబులతో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. మరి వెంకటేష్ సినిమా ఈ సినిమాలు పూర్తయ్యాక ఉంటుందా..? లేక మధ్యలోనే పట్టాలెక్కిస్తాడో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Advertisement
Advertisement