'ఓరుగల్లు అమ్మాయితోనే పెళ్లి' | Sakshi
Sakshi News home page

'ఓరుగల్లు అమ్మాయితోనే పెళ్లి'

Published Sat, Jan 13 2018 3:14 PM

Vijay devarakonda in warangal - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సెన్సేషనల్ స్టార్‌ విజయ్‌ దేవరకొండ పెళ్లిపై తన మనసులో మాట చెప్పాడు. వరంగల్‌ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్‌ వివాహంపై తన అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. తన అన్నయ్య వరంగల్‌ అమ్మాయినే పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్నాడని.. తాను కూడా ఓరుగల్లు అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని తెలిపాడు. అదేవిధంగా రాజకీయాల్లోకి వస్తే ఓటేస్తారా అని విజయ్‌ అభిమానులను అడగగా .. అందరూ కేరింతలు కొడుతూ విజయ సంకేతం చూపారు.

కార్యక్రమం అనంతరం హన్మకొండ రాంనగర్‌లోని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇంటికి వెళ్లారు. వారు ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా రాబోయే తన సినిమా విశేషాలపై ఎర్రబెల్లి, విజయ్‌ సరదాగా మాట్లాడుకున్నారు.




 

Advertisement

తప్పక చదవండి

Advertisement