అర్జున్ రెడ్డి.. ఆ హీరో చేయాల్సింది..! | Sakshi
Sakshi News home page

అర్జున్ రెడ్డి.. ఆ హీరో చేయాల్సింది..!

Published Thu, Aug 24 2017 1:41 PM

అర్జున్ రెడ్డి.. ఆ హీరో చేయాల్సింది..!

తెలుగు రాష్ట్రాల్లో కాంట్రవర్సీలతో భారీ హైప్ క్రియేట్ చేసిన తాజా చిత్రం అర్జున్ రెడ్డి. విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ఆడియన్స్ ముందుకు వస్తోంది. బాహుబలి సినిమా తరువాత పెయిడ్ ప్రీవ్యూస్ వేస్తున్న సినిమాగా రికార్డ్ సృష్టించిన అర్జున్ రెడ్డి కథకు ముందుగా మరో హీరోను అనుకున్నారట.

మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాకు స్క్రిప్ట్ వర్క్ చేసిన సందీప్ అదే సమయంలో అర్జున్ రెడ్డి కథ రెడీ చేసుకున్నాడు. దీంతో శర్వానంద్ హీరోగా ఈ సినిమా తెరకెక్కించాలని భావించాడట. అయితే అప్పటికే శర్వానంద్ ఫుల్ బిజీగా ఉండటంతో విజయ్ హీరోగా సినిమాను స్టార్ట్ చేశారు. పెళ్లిచూపులు సినిమా కన్నా ముందే షూటింగ్ ప్రారంభమైనా.. లోకేషన్ల విషయంలో కాంప్రమైజ్ కాకపోవటంతో సినిమా ఆలస్యమైంది.

ఈ సినిమా ఫైనల్ కట్ అయిన తరువాత కూడా నాలుగు గంటలకు పైనే ఉందట.. అయితే డిస్ట్రిబ్యూటర్ల వత్తిడి మేరకు సినిమాను మూడు గంటలకు కుందించి రిలీజ్ చేస్తున్నారు. అలా కూడా ఇటీవల కాలం రిలీజ్ అయిన అతి పెద్ద సినిమాగా మరో రికార్డ్ ను తన ఖాతాలో వేసుకోబోతోంది అర్జున్ రెడ్డి.

Advertisement
Advertisement