ఖుషి హీరోకి గ్రీన్‌ సిగ్నల్‌! | Sakshi
Sakshi News home page

ఖుషి హీరోకి గ్రీన్‌ సిగ్నల్‌!

Published Fri, Dec 30 2016 11:50 PM

ఖుషి హీరోకి గ్రీన్‌ సిగ్నల్‌!

‘ఖుషి’ అనగానే పవన్‌ కల్యాణ్, భూమిక గుర్తొచ్చారా? వారిద్దరూ మరోసారి సందడి చేస్తే చూడ్డానికి బాగుంటుం దని సంబరపడిపో తున్నారా? అయితే మేము చెబుతున్నది తమిళ ‘ఖుషి’ జంట విజయ్, జ్యోతిక గురించి. ఈ ఇద్దరూ జంటగా ఎస్‌.జె.సూర్య దర్శకత్వంలో ఏయం. రత్నం నిర్మించిన తమిళ ‘ఖుషి’ పదహారేళ్ళ క్రితం 2000లో విడుదలైంది. ఆ చిత్రం అక్కడ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కావడంతో పవన్‌ కల్యాణ్, భూమిక జంటగా ఎస్‌.జె. సూర్య దర్శకత్వంలో తెలుగులో రీమేక్‌ చేశారు రత్నం. ఆ సంగతి అలా ఉంచితే... ‘ఖుషి’ తర్వాత విజయ్‌–జ్యోతిక ‘తిరుమలై’ అనే చిత్రంలో జంటగా నటించారు.

ఈ చిత్రం విడుదలై పధ్నాలుగేళ్లవుతోంది. ఇన్నేళ్లలో ఇద్దరూ కలసి సినిమా చేయలేదు.  ఇప్పుడు ఒక సినిమాలో నటించనున్నారని భోగట్టా. అయితే జంటగా కాదు. విజయ్‌ హీరోగా అట్లి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. ఇందులో కాజల్, సమంత కథానాయికలనీ... ముఖ్యపాత్రలో జ్యోతిక నటించనున్నారనీ టాక్‌.

Advertisement

తప్పక చదవండి

Advertisement