15న 10 చిత్రం | Sakshi
Sakshi News home page

15న 10 చిత్రం

Published Thu, Dec 7 2017 12:54 AM

Vikram-Samanthas 10 release date out  - Sakshi

‘‘10 ఎన్రదుకుళ్ల’... అంటే తెలుగులో పది లెక్కపెట్టే లోపు అని అర్థం. అయితే పది అంకెలు దేనికి లెక్కపెట్టాలి? ఆ టైమ్‌లో ఏం జరుగుతుందనే ఆసక్తికర అంశాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే’ ’ అంటున్నారు నిర్మాతలు. విక్రమ్, సమంత జంటగా విజయ్‌ మిల్టన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘10 ఎన్రదుకుళ్ల’.

ఈ సినిమాను తెలుగులో ‘10’ అనే టైటిల్‌తో శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌ పతాకంపై జి.సుబ్రమణ్యం, ఎం. సుబ్బారెడ్డి, రామారావు ఈ నెల 15న తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. వారు మాట్లాడుతూ..‘‘ ఈ చిత్రంలో విక్రమ్‌ పాత్ర కొత్తగా ఉంటుంది. సమంత ద్విపాత్రాభినయం హైలైట్‌. మాస్‌ ఆడియన్స్‌తో పాటు క్లాస్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకొంటుందన్న నమ్మకం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో విడుదల చేయనున్నాం’’ అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement