మోహన్ బాబు టైటిల్తో విశాల్ | Sakshi
Sakshi News home page

మోహన్ బాబు టైటిల్తో విశాల్

Published Sun, Apr 17 2016 12:23 PM

మోహన్ బాబు టైటిల్తో విశాల్ - Sakshi

కోలీవుడ్ రాజకీయాల్లో కీ రోల్ ప్లే చేస్తున్న యంగ్ హీరో విశాల్ సినిమాల విషయంలోనూ అదే జోరు చూపిస్తున్నాడు. సంక్రాంతి బరిలో కథాకళి సినిమాతో సత్తా చాటిన విశాల్, వెంటనే మరో సినిమాను రిలీజ్ కు రెడీ చేశాడు. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశాడు. తమిళంలో మరుదు పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో 'రాయుడు' పేరుతో రిలీజ్ చేయనున్నారు.
 
15 ఏళ్ల కిందట మోహన్ బాబు లీడ్ రోల్ లో ఇదే పేరుతో సినిమా రిలీజ్ అయ్యింది. ఇప్పుడు విశాల్ ఆ పేరు వాడుకుంటున్నాడు. ఫస్ట్ లుక్ తోనే సినిమా ఊరమాస్ అంటూ సిగ్నల్ ఇచ్చేసిన విశాల్ మరో భారీ హిట్ మీద కన్నేశాడు. ముత్తయ్ అనే యువ దర్శకుడు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో తెలుగమ్మాయి శ్రీ దివ్య హీరోయిన్ గా నటిస్తోంది. రఘువరన్ బీటెక్ సినిమాకు దర్శకత్వం వహించిన వేల్ రాజా సినిమాటోగ్రఫి అందిస్తున్న ఈ సినిమాను మే నెలలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement