తల్లి కావాలనుంది.. కానీ ఇప్పుడే కాదు | Sakshi
Sakshi News home page

తల్లి కావాలనుంది.. కానీ ఇప్పుడే కాదు

Published Mon, Jul 20 2015 10:01 AM

తల్లి కావాలనుంది.. కానీ ఇప్పుడే కాదు - Sakshi

ముంబయి: తనకు తల్లి కావాలన్న ఆశ ఉంది కానీ ఇప్పుడే కాదని బాలీవుడ్ ప్రముఖ నటి కరీనా కపూర్ అన్నారు. 2012 అక్టోబర్ నెలలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ను వివాహమాడిని తర్వాత కొద్దొ రోజులపాటు నటనకు దూరంగా ఉన్న ఆమె మరోసారి రంగప్రవేశం చేశారు. ప్రస్తుతం ఆయా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆమె నటించిన తాజా చిత్రం బజరంగీ భైజాన్ మొన్న రంజాన్కు విడుదలై రికార్డుల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే.

ఈ చిత్రం విజయోత్సవాన్ని పురస్కరించుకొని మాట్లాడుతూ తనకు అమ్మగా మారాలని ఉంది కానీ, మరో రెండు మూడు సంవత్సరాల వరకు అలాంటి ప్రణాళికలేవీ లేవన్నారు. అయితే, ఏదో ఒక రోజు తాను తల్లిగా మారతానని చెప్పారు. తాను ముందుముందు కూడా మరిన్ని చిత్రాల్లో నటిస్తానని, నటిస్తూనే ఉంటానని, తనకు కెరీర్ వచ్చిందే నటన నుంచి అని తెలిపారు. జీవితం విషయంలో తనకు ఎలాంటి బాధ లేదని, సైఫ్తో జీవితం చాలా బాగుందని చెప్పారు. చిత్రాల్లో నటించడం తానెప్పుడూ గర్వంగానే ఫీలవుతానని తెలిపారు.

Advertisement
Advertisement