'బాహుబలి' కోసం అన్నీ వదిలేస్తా: కాజల్ | Sakshi
Sakshi News home page

'బాహుబలి' కోసం అన్నీ వదిలేస్తా: కాజల్

Published Sat, Nov 5 2016 6:15 PM

'బాహుబలి' కోసం అన్నీ వదిలేస్తా: కాజల్ - Sakshi

బెంగళూరు: టాలీవుడ్ డైరెక్టర్ యస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన 'బాహుబలి' ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రికార్డులు తిరగరాసింది. అందువల్ల టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కు మరోసారి రాజమౌళి దర్శకత్వంలో పనిచేయాలని ఉందట. 'బహుబలి-3'లో తనకు అవకాశం వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునేది లేదని చెప్పింది. కాజల్ గతంలో రాజమౌళి తీసిన 'మగధీర'లో యువరాణి మిత్రవిందగా నటించి ఆకట్టుకుంది.  

'ప్రస్తుతం బాహుబలి: ది కంక్లూజన్ షూటింగ్ జరుగుతోంది. ఒకవేళ రాజమౌళి బాహుబలి మూడో పార్ట్ తీస్తే, అందులో అవకాశం కోసం ఎదురుచూస్తాను. బాహుబలిలో నటించనందుకు ఎలాంటి బాధలేదు. ఆ మూవీ ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నందుకు సంతోషంగా ఉంది. జీవితంలో ఇలాంటి సినిమా ఒక్కసారి మాత్రమే చేయగలం. మూడో పార్ట్లో నాకు అవకాశం వస్తే, ఇతర అన్ని ప్రాజెక్టులను పక్కనపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను' అని కాజల్ చెప్పుకొచ్చింది. టాలీవుడ్, కోలీవుడ్ మూవీలతో బిజీగా ఉండటంతో బాలీవుడ్ మూవీలు తక్కువగా చేస్తున్నానంటోంది కాజల్.

Advertisement

తప్పక చదవండి

Advertisement