పిల్లా నీకేదంటే ఇష్టం

21 Sep, 2018 03:10 IST|Sakshi

లక్ష్మీ రాయ్, రామ్‌ కార్తీక్, పూజిత పొన్నాడ, ప్రవీణ్, మధు నందన్‌ ముఖ్య తారలుగా కిశోర్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వేర్‌ ఈజ్‌ ది వెంకటలక్ష్మి’. ఏబీటీ క్రియేషన్స్‌ పతాకంపై ఎమ్‌. శ్రీధర్‌రెడ్డి, హెచ్‌. ఆనంద్‌ రెడ్డి, ఆర్కే రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్‌ లోగోను దర్శక–నిర్మాతలు లాంచ్‌ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘పిల్లా నీకేదంటే ఇష్టం.. యాపిల్‌ పిల్లా నీకేదంటే ఇష్టం’ అనే మాసీ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకు హరి గౌర సంగీతం అందిస్తున్నారు.

ఈ సాంగ్‌కు శేఖర్‌ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నేత గురునాథ్‌రెడ్డి మాట్లాడుతూ– ‘‘కొంతకాలం క్రితం ఈ సినిమా ప్రయాణం మొదలైంది. అమలాపురంలో దాదాపు 40 రోజులు షూటింగ్‌ జరిపాం. ఇంకో పదిరోజులు అక్కడే షూటింగ్‌ జరిపితే ఈ సినిమా దాదాపు పూర్తి అవుతుంది. కామెడీ థ్రిల్లర్‌ చిత్రమిది. ఈ దీపావళికి ఈ సినిమాను రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం. లక్ష్మీరాయ్‌ బహుభాషా నటి. అద్భుతంగా నటిస్తున్నారు. డైరెక్టర్‌ కిశోర్‌ చక్కగా తెరకెక్కిస్తున్నారు. కార్తీక్, ప్రవీణ్, మధు నందన్‌ బాగా నటిస్తున్నారు.

హరి మంచి సంగీతం అందిస్తున్నారు. సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘ప్రస్తుతం చిత్రీకరిస్తున్న మాస్‌ సాంగ్‌ హైలైట్‌గా నిలుస్తుంది. సినిమాపై పూర్తి నమ్మకం ఉంది’’ అన్నారు ఆనంద్‌రెడ్డి. ‘‘కామెడీ చిత్రమిది. మంచి టీమ్‌ కుదిరింది. ఈ సినిమాలో భాగం కావడం హ్యాపీ. నిర్మాతలకు థ్యాంక్స్‌’’ అన్నారు లక్ష్మీ రాయ్‌. ‘‘నన్ను నమ్మిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్‌. ప్రేక్షకులను నవ్వించడానికి చేసే ప్రయత్నమే ఈ చిత్రం’’ అన్నారు కిశోర్‌. ఈ కార్యక్రమంలో రామ్‌కార్తీక్, ప్రవీణ్, మధు నందన్, డీఓపీ వెంకట్, కిశోర్, పూజిత, పంకజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా