ఒక్కసారిగా ఉలిక్కిపడ్డా..!

16 May, 2015 23:14 IST|Sakshi
ఒక్కసారిగా ఉలిక్కిపడ్డా..!

‘‘కొత్త వాళ్లను అర్థం చేసుకుని ప్రోత్సహించడంలో అమితాబ్ బచ్చన్, షారుక్‌ఖాన్ ఎప్పుడూ ముందుంటారు. ‘ఓం శాంతి ఓం’ సినిమాలో నటిస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. అప్పటికీ ఓ కన్నడ చిత్రంలో చేసినా, బాలీవుడ్ అనేసరికి కొంచెం టెన్షెన్ ఫీలయ్యా. ఇక షారుక్‌ఖాన్ సరసన అనేసరికి ఇక చాలా ఒత్తిడికి లోనయ్యా. కానీ షారుక్‌ఖాన్ నా భయాన్ని, బెరుకును అర్థం చేసుకున్నారు. నన్ను తన స్థాయికి తగ్గట్టుగా చూశారు. ఇద్దరం ఒకటే అనే భరోసా ఇచ్చారు.
 
  దాంతో నా టెన్షన్ పోయింది. ఇక అమితాబ్ బచ్చన్‌తో మొదట ‘ఆరక్షణ్’ సినిమాలో నటించా. ఆయనతో అప్పటి కి అంతగా పరిచయం లేదు. ఆ సినిమా సెట్‌లో అందరినీ పలకరించా. కానీ ఆయన అక్కడే ఉన్నారు. అంతమందిలో ఆయనను గుర్తుపట్టలేదు. దాంతో ఆయన వెనక నుంచి ‘‘ఏయ్’’ అనేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. అంతమందిలో అలా అనేసరికి చాలా ఇబ్బందిపడ్డాను. తర్వాత ఆయనతో మెల్లగా పరిచయం పెరిగాక ఆయనేంటో తెలిసింది.’’
 

>