డేరింగ్‌ స్టెప్‌@డిసెంబర్‌!?

30 Oct, 2017 05:21 IST|Sakshi

మొన్నటివరకూ కథ... రెడీ! కత్తులు... రెడీ! కథానాయకులు... రెడీ! కానీ, ఒక్కరు మాత్రం రెడీగా లేరు. ఎవరు? అంటే... కథానాయిక! కథానాయకులతో సమానంగా కత్తి పట్టుకుని యుద్ధం చేసే కథానాయిక లేరు. మరి, ఇప్పుడు... కత్తి పట్టుకోవడానికి దిశా పాట్నీ రెడీ! తమిళ నటులు ఆర్య, ‘జయం’ రవి హీరోలుగా నటి ఖుష్బూ భర్త, దర్శకుడు సుందర్‌ .సి తీయనున్న ‘సంఘమిత్ర’లో రాణి సంఘమిత్రగా నటించడానికి దిశా పాట్నీ అంగీకరించిన సంగతి తెలిసిందే.

తెలుగులో ‘లోఫర్‌’, హిందీలో ‘ఎం.ఎస్‌. ధోని’ సినిమాల్లో గ్లామరస్‌గా కనిపించిన ఈ బ్యూటీ, వారియర్‌ ప్రిన్సెస్‌ రోల్‌ యాక్సెప్ట్‌ చేయడం డేరింగ్‌ స్టెప్‌గా చెప్పుకోవచ్చు. ఓ పక్క హిందీ ‘బాఘీ–2’లో నటిస్తున్న దిశ, మరోపక్క ‘సంఘమిత్ర’ కోసం కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ తదితర అంశాల్లో ట్రైనింగ్‌ తీసుకుంటున్నారు. డిసెంబర్‌ నుంచి డేరింగ్‌ స్టెప్‌ వేస్తారట! అంటే... డిసెంబర్‌లో ‘సంఘమిత్ర’ షూటింగ్‌ ప్రారంభించడానికి సుందర్‌ .సి సన్నాహాలు చేస్తున్నారు. ఆల్మోస్ట్‌ 200 కోట్ల బడ్జెట్‌తో శ్రీ తేనాండాళ్‌ సంస్థ ఈ సినిమా నిర్మిస్తోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా