బాబీసింహా, రేష్మీమీనన్‌ల పెళ్లైంది | Sakshi
Sakshi News home page

బాబీసింహా, రేష్మీమీనన్‌ల పెళ్లైంది

Published Sat, Apr 23 2016 2:25 AM

బాబీసింహా, రేష్మీమీనన్‌ల పెళ్లైంది - Sakshi

తమిళసినిమా: యువ నటుడు బాబీసింహా, నటి రేష్మీమీనన్‌ల వివాహం శుక్రవారం ఉదయం  తిరుమలలో జరిగింది. నేరం, కాదలిల్‌సోదప్పవదు ఎప్పదీ, జిగర్‌తండా చిత్రాల్లో ముఖ్యపాత్రలు పోషించిన నటుడు బాబీసింహా. ఆ తరువాత కథానాయకుడిగా పలు చిత్రాల్లో నటిస్తున్నారు. ఉరిమీన్ చిత్ర షూటింగ్‌లో ఆ చిత్ర కథానాయికి రేష్మీమీనన్‌తో పరిచయం ప్రేమగా మారింది. వీరి ప్రేమకు పెద్దలు పచ్చజెండా ఊపడంతో గత ఏడాది నవంబర్ 8వ తేదీన బాబీసింహా,రేష్మీమీనన్‌ల వివాహ నిశ్చితార్థం జరిగింది.

వివాహం శుక్రవారం ఉదయం తిరుమలలో కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా జరిగింది.  వీరి వివాహ రిసెప్షన్ ఆదివారం చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్‌లో జరుగనుంది.

Advertisement
Advertisement