నిఖిల్‌ కూడా లవ్‌ ఫెయిల్యూరే.. | Sakshi
Sakshi News home page

నిఖిల్‌ కూడా లవ్‌ ఫెయిల్యూరే..

Published Wed, Feb 14 2018 1:36 PM

Nikhil Kirrak Party Poster - Sakshi

రోజా పువ్వు ప్రేమకు సంకేతం. ఎవరైనా వారి ప్రేమను ప్రేమికుల రోజున ఒక రోజా పువ్వు ఇచ్చి తెలియజేస్తారు. యంగ్‌ హీరో నిఖిల్‌ కూడా లవ్‌ ఫెయిల్యూర్‌రే. నిఖిల్‌ గర్ల్‌ఫ్రెండ్‌ తన ప్రేమను తిరస్కరించింది. ఇది నిజజీవితంలో కాదు. కిరాక్‌ పార్టీ అనే మూవీలో. యంగ్‌ హీరో నిఖిల్‌ నటిస్తున్న కిరాక్‌ పార్టీలోని ఓ పోస్టర్ను చిత్ర యూనిట్‌ ప్రేమికుల రోజున విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో నిఖిల్‌ దిగులుగా, వంగిపోయినా రోజా పువ్వుతో కనిపించారు. 

ఈ సినిమాలో హీరో లవ్‌ ఫెయిల్యూర్‌ పాత్రలో నటిస్తున్నారు. యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నిఖిల్ హీరోగా కన్నడ సూపర్ హిట్ సినిమా ‘కిరిక్ పార్టీ’ని తెలుగు రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిఖిల్ సరసన సంయుక్త హెగ్డే, సిమ్రాన్ పరీంజా కథానాయికలుగా నటిస్తున్నారు. 

శరణ్ కొప్పిశెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి యువ దర్శకులు సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే, మరో యువ దర్శకుడు చందూ మొండేటి సంభాషణలు సమకూరుస్తుండడం విశేషం. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా త్వరలో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న నిఖిల్‌కు ఈ సినిమా మరో విజయాన్ని అందిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్‌.

Advertisement
Advertisement