అన్నాడీఎంకే కీలక తీర్మానాలు | Sakshi
Sakshi News home page

అన్నాడీఎంకే కీలక తీర్మానాలు

Published Thu, Dec 29 2016 11:20 AM

14 resolutions passed at the AIADMK meet

చెన్నై: దేశమంతా ఆసక్తిగా ఎదురుచూసిన అన్నాడీఎంకే కీలక సర్వసభ్య సమావేశం కొనసాగుతోంది. జయలలిత స్నేహితురాలి శశికళ నటరాజన్‌ ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంటూ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. జయలలిత చనిపోయిన తర్వాత తొలిసారిగా జరిగిన సర్వసభ్య సమావేశంలో 14 తీర్మానాలు ఆమోదించారు.

ఈ సమావేశానికి శశికళ హాజరుకాలేదు. భేటీ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం పొయెస్‌ గార్డెన్‌ కు వెళ్లి శశికళను కలిశారు. సమావేశంలో ఆమోదించిన తీర్మానం కాపీని ఆమె అందజేశారు. సభ్యుల కోరిక మేరకు పార్టీ పగ్గాలు చేపట్టేందుకు  అంగీకరించిన ఆమె తీర్మానం కాపీపై సంతకం చేశారు. అంతకుముందు పన్నీరు సెల్వం మాట్లాడుతూ... ఎంజీఆర్‌ ను జయలలితలో చూసుకున్నాం, ఇప్పుడు ‘అమ్మ’ను శశికళలో చూసుకుంటున్నామని అన్నారు.

సర్వసభ్య సమావేశంలో ఆమోదించిన తీర్మానాలు

  • శశికళ నటరాజన్‌ నాయకత్వంలో పనిచేయాలని ఏకగ్రీవ తీర్మానం
  • నిబంధనలు సవరించి ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికల నిర్వహణ
  • జయలలితకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలి
  • పార్లమెంట్‌ లో జయలలిత కాంస్య విగ్రహం ఏర్పాటుకు విజ్ఞప్తి
  • ‘అమ్మ’ పుట్టినరోజును జాతీయ రైతు దినోత్సవంగా ప్రకటించాలి
  • జయలలితకు నోబెల్‌ శాంతి పురస్కారం దక్కేలా ప్రయత్నం చేయాలి

Advertisement

తప్పక చదవండి

Advertisement