జీశాట్-16 ప్రయోగం వాయిదా | Sakshi
Sakshi News home page

జీశాట్-16 ప్రయోగం వాయిదా

Published Fri, Dec 5 2014 5:46 AM

-16 Jisat trial postponed

సూళ్లూరుపేట/బెంగళూరు: ఫ్రెంచి గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి శుక్రవారం తె ల్లవారుజామున  చేపట్టాల్సిన జీశాట్-16 ఉపగ్ర హ ప్రయోగం ప్రతికూల వాతావరణం కారణంగా వాయిదా పడింది.

ఫ్రాన్స్‌కు చెందిన ఏరియన్ రాకెట్ ద్వారా జీశాట్-16ను ప్రయోగించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఏర్పాట్లు పూర్తిచేసినా, వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రయోగాన్ని వాయిదా వేశారు.

ఏరియన్ రాకెట్ ద్వారా భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్న ఈ ఉపగ్రహంలో సమాచార వ్యవస్థకు ఉపయోగించే 12 కేయూ బ్యాండ్, 24 సీబ్యాండ్, 12 ఎక్స్‌టెండెడ్ సీబ్యాండ్ ట్రాన్స్‌పాండర్ల(సిగ్నళ్లను స్వీకరించి, ప్రసారం చేసే పరికరాలు)ను అమర్చారు. జీశాట్-16 ఉపగ్రహం భారత్ ప్రయోగిస్తున్న 11వ సమాచార ఉపగ్రహం కాగా, పెద్దమొత్తంలో 48 ట్రాన్స్‌పాండర్లను ఒకేసారి పంపనుండటం ఇదే తొలిసారి.

Advertisement

తప్పక చదవండి

Advertisement