పద్దెనిమిది నెలలకే ఈ బుజ్జాయి అద్భుతం | Sakshi
Sakshi News home page

పద్దెనిమిది నెలలకే ఈ బుజ్జాయి అద్భుతం

Published Wed, Sep 21 2016 8:20 AM

పద్దెనిమిది నెలలకే ఈ బుజ్జాయి అద్భుతం

నాగ్పూర్: ఓ బుజ్జాయి చిత్రాలు చీదిస్తోంది. అందరినీ ఆకట్టుకుంటోంది. బుల్లిబుల్లి అడుగులు వేసే వయసులోనే ముద్దుపలుకులు మాట్లాడటమే కాదు.. ఒక్కోసారి విద్యావంతులు కూడా చెప్పలేని సమాధానాలు అలవోకగా చెబుతోంది. 26 దేశాల కరెన్సీ వివరాలు చెప్పడంతోపాటు ఏడు ప్రపంచ వింతలు అవి ఉన్న దేశాల పేర్లు.. ఆ పేర్లను ఆంగ్లం నుంచి మరాఠీలోకి తర్జుమా కూడా చేయగలుగుతుంది. ఇంతకీ ఆ చిన్నారి వయసెంతో తెలుసా ఏడాదిన్నర.. అంటే పట్టుమని పద్దెనిమిది నెలల ప్రాయం. ఆ పాప పేరు అద్విక బాలే.

ఈ మరాఠీ చిన్నారి ఈ ఒక్క విషయంలోనే కాదు.. చిన్నతనం నుంచే ఎంతో ఆసక్తిగొలిపేలా చేసింది. ఆరు నెలల సమయంలోనే తన ముందు తల్లి అసవరి బాలే పుస్తకాలు చదివితేనే ఏడుపు ఆపేది. దీంతో ఆ పాప ఆసక్తిని గమనించిన తల్లి ఎనిమిది నెలల నుంచి దేశాల పేర్లు, కరెన్సీ చెప్పడం మొదలు పెట్టింది. అంతకుముందు ఆ పాప పాకడం నేర్చుకున్న సమయంలో అల్పాబెట్స్ చూపించడం, పండ్లు, జంతువుల బొమ్మలు చూపించి వాటి పేర్లు అలవాటు చేసింది.

ఇక పది నెలలు వచ్చే సరికి మనిషి అవయవాలను గుర్తించగలిగిందని పాప తండ్రి సాగర్ చెప్పాడు. ఓ మీడియా ఆ పాప వద్దకు వెళ్లి ఓ వంద ప్రశ్నలు వేయగా దాదాపు ఒక రెండు ప్రశ్నలు తప్ప మిగితావాటన్నింటికి సమాధానాలు చెప్పి ఔరా అనిపించింది. పుస్తకాలు కనిపిస్తే తమ పాప ఎంతో ఆసక్తిగా వాటిని చేతిలోకి తీసుకొని పరిశీలనగా చూస్తోందని.. జ్ఞానం సంపాధించేందుకు ఎంతో వేగిరంగా తమ కూతురు చూస్తోందని ఆ తల్లి దండ్రులు మురిసిపోతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement